మ‌ల్టీస్టార‌ర్ ప్లానింగ్‌లో హారీష్ శంక‌ర్‌

Published On: August 16, 2017   |   Posted By:

మ‌ల్టీస్టార‌ర్ ప్లానింగ్‌లో హారీష్ శంక‌ర్‌

షాక్‌తో షాక్ తిన్న ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ త‌ర్వాత మిర‌ప‌కాయ్‌, గ‌బ్బ‌ర్ సింగ్ వ‌రుస హిట్స్‌తో టాప్ లీగ్ డైరెక్ట‌ర్ అయ్యాడు. అయితే రామ‌య్యా వ‌స్తావ‌య్యా సినిమాతో మ‌ళ్లీ బ్రేక్ ప‌డింది. త‌ర్వాత సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌, డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ వ‌రుస స‌క్సెస్‌ల‌ను సాధించాడు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే హ‌రీష్ శంక‌ర్ వ‌రుస సినిమాల‌ను దిల్‌రాజు బ్యాన‌ర్‌లోనే తెర‌కెక్కిస్తున్నాడు.

ఇదే బాట‌లో హ‌రీష్ త‌న తదుప‌రి చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లోనే తదుపరి సినిమా చేయబోతున్నాడు. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. సినిమాలో ఎక్కువ భాగం అమెరికాలోనే చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకోనుంది. ఇప్పుడు లోకేష‌న్స్‌ను ఫైన‌లైజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా నాని లేదా శ‌ర్వానంద్ న‌టిస్తాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాను మల్టీస్టారర్ మూవీ రూపొందించ‌నున్నార‌ట‌. నాని, శ‌ర్వానంద్‌ల పేర్లు ప్ర‌ముఖంగా హీరోలుగా విన‌ప‌డుతున్నాయి. అల్రెడి ఈ సినిమా కోసం దిల్‌రాజు అండ్ టీం దాగుడుమూత‌లు అనే టైటిల్‌ను రిజిష్ట‌ర్ చేయించారు.