మ‌ళ్లీ న‌టించేందుకు సిద్ధం –  డిస్కో శాంతి

Published On: April 17, 2018   |   Posted By:

మ‌ళ్లీ న‌టించేందుకు సిద్ధం –  డిస్కో శాంతి

రౌడీ అల్లుడు, ఘ‌రానా మొగుడు వంటి ప‌లు చిత్రాల్లో స్పెష‌ల్ సాంగ్స్‌లో న‌టించి మెప్పించిన డిస్కోశాంతి.. న‌టిగా కూడా త‌న‌దైన ముద్ర‌వేశారు. తెలుగు, త‌మిళం, క‌న్న‌డం, హిందీతో క‌లిపి 140 సినిమాల్లో న‌టించారు.

ప్ర‌ముఖ న‌టుడు శ్రీహ‌రిని పెళ్లాడిన త‌ర్వాత సినిమాల‌కు దూర‌మ‌య్యారు. అయితే శ్రీహ‌రి మ‌ర‌ణం త‌ర్వాత డిస్కోశాంతి మాన‌సికంగా కుంగిపోయారు.  డిస్కోశాంతి ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో తాను మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర‌లు వ‌స్తే త‌ప్ప‌కుండా న‌టిస్తాన‌ని వెల్ల‌డించారు.

సీనియ‌ర్ న‌టీన‌టులు మ‌ళ్లీ తెరంగేట్రం చేస్తున్న నేప‌థ్యంలో డిస్కోశాంతికి ఎలాంటి పాత్ర‌లు వ‌స్తాయో వేచి చూడాల్సిందే.