మ‌హేశ్ మేన‌ల్లుడు సినీ ఎంట్రీ

Published On: April 16, 2018   |   Posted By:

మ‌హేశ్ మేన‌ల్లుడు సినీ ఎంట్రీ

 

న‌ట వార‌సులు తెలుగు చిత్ర సీమ‌కు కొత్తేం కాదు.. ఇప్పుడు మ‌రో న‌ట వార‌సుడు తెలుగు చిత్ర సీమ‌లోకి అడుగు పెడుతున్నాడు. ఆ హీరో ఎవ‌రో కాదు సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ మేన‌ల్లుడు. తెలుగు దేశం పార్ల‌మెంట్ స‌భ్యుడైన గ‌ల్లా జ‌య‌దేవ్ తన‌యుడు గ‌ల్లా అశోక్‌. ఇప్ప‌టికే చిత్ర సీమ‌లోకి అడుగు పెట్ట‌డానికి కావాల్సిన రీతిలో గ‌ల్లా అశోక్ శిక్ష‌ణ తీసుకున్నాడు. త్వ‌ర‌లోనే హీరోగా తెర‌పై క‌నిపించ‌నున్నాడు. విన‌ప‌డుతున్న స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించ‌నున్నారు. `ఆడు మ‌గాడ్రా బుజ్జి` ద‌ర్శ‌కుడు కృష్ణారెడ్డి సినిమాను డైరెక్ట్ చేయ‌నున్నాడు. త్వ‌ర‌లోనే అధికారిక స‌మాచారం రానుంది.