మ‌హేష్ అతిథిగా ర‌జ‌నీకాంత్‌

Published On: August 19, 2017   |   Posted By:
మ‌హేష్ అతిథిగా ర‌జ‌నీకాంత్‌
సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌కున్న క్రేజ్ గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. సౌతిండియా సూప‌ర్‌స్టార్ అయిన ర‌జ‌నీకాంత్ ఇప్పుడు టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు వేడుక‌కు అతిథిగా రాబోతున్నాడ‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. తెలుగు, త‌మిళం, హిందీ భాషల్లో మ‌హేష్‌, ఎ.ఆర్‌.మురుగ‌దాస్ స్పైడ‌ర్ సెప్టెంబ‌ర్ 27న భారీగా విడుద‌ల కానుంది. సెప్టెంబ‌ర్ 9న ఈ సినిమా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మం ఒక‌టి చెన్నైలో భారీ స్థాయిలో జ‌ర‌గ‌నుంది.
ఈ ప్ర‌మోష‌న‌ల్ వేడుక‌కు సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, డైరెక్ట‌ర్ శంక‌ర్‌లు అతిథులుగా రాబోతున్నారు. వీరిద్ద‌రూ అతిథులుగా రావ‌డానికి కారణం నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌. ఈ నిర్మాణ సంస్థ రోబో సీక్వెల్ 2.0 సినిమాను 400 కోట్ల‌కు పైగా భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తుంది. అలాగే త‌మిళ స్పైడ‌ర్ హ‌క్కుల‌ను ఫ్యాన్సీ రేటు చెల్లించి ద‌క్కించుకుంది. నిర్మాణ సంస్థ ఒక‌టే కావ‌డంతో సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ మ‌రో సూప‌ర్‌స్టార్ మ‌హేష్ వేడుక‌కు చీఫ్ గెస్ట్‌గా వ‌స్తున్నాడ‌న్న‌మాట‌.