మ‌హేష్ బాబు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో మరో చిత్రం

Published On: August 12, 2021   |   Posted By:
 
మ‌హేష్ బాబు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో మరో చిత్రం
 
 
సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో మరో చిత్రం రూపొందనుందని ప్రకటన వచ్చిన నాటినుంచి చిత్రం పై ఉత్సుకత ఇటు సినీ వర్గాల్లోనూ, అటు ప్రేక్షక వర్గాల్లోనూ నానాటికీ పెరుగుతూ వస్తోంది. 
 
సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ప్రచార చిత్రం ను విడుదల చేసారు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్‘ చిత్రం యూనిట్. 
 
జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా ఈ చిత్రానికి ఎంపిక అయ్యారు. అలాగే కళా దర్శకునిగా అశోక్, ఛాయాగ్రాహకుడు గా ‘మధీ‘, సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.
 
 
ఇక  సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు సరసన అందం, అభినయం కలబోసిన తార ‘ పూజాహెగ్డే‘ మరోసారి జతకడుతున్నారు. 
 
 
చిత్రానికి సంభందించి పూర్వ నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. చిత్రం షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది, మరిన్ని ఇతర వివరాలు త్వరలో మరో ప్రకటనలో తెలియ పరుస్తామని చిత్ర నిర్మాత  ఈ సందర్భంగా తెలిపారు. 
 
సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ‌(చిన‌బాబు) నిర్మిస్తున్న ఈ  భారీ చిత్రం, మ‌హేష్-త్రివిక్ర‌మ్‌ల హ్యాట్రిక్ మూవీగా రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన‌ ఎన్నో ఇంట్రెస్టింగ్ అంశాలు వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి.డి.వి. ప్రసాద్
 
 
ఒక స్పెష‌ల్ క్రేజ్ ఉన్న #SSMB28కి స‌మ‌ర్ప‌ణ: శ్రీ‌మ‌తి మ‌మ‌త‌, నిర్మాత‌: సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ‌(చిన‌బాబు), ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: త్రివిక్ర‌మ్‌.