మ‌హేష్ మూవీ భ‌ర‌త్ అనే నేను అప్‌డేట్‌

Published On: February 12, 2018   |   Posted By:

మ‌హేష్ మూవీ భ‌ర‌త్ అనే నేను అప్‌డేట్‌

సూపర్ స్టార్ మహేష్, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో `శ్రీమంతుడు` సినిమా త‌ర్వాత రూపొందుతోన్న చిత్రం `భ‌ర‌త్ అనే నేను`. డి.వి.వి.దాన‌య్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో యాక్ష‌న్ సీన్స్‌ను చిత్రీక‌రిస్తున్నారు. తాజా షెడ్యూల్‌లో హీరో మ‌హేష్‌, హీరోయిన్ కైరా అద్వానిపై ఓ సాంగ్‌ను చిత్రీక‌రించాల్సి ఉంద‌ట‌. ప్యాచ్ వ‌ర్క్ స‌హా సినిమాను మార్చి 27కంతా పూర్తి చేసేస్తార‌ట‌. నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసేసి సినిమాను ఏప్రిల్ 27న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.  త‌మిళ న‌టుడు శ‌ర‌త్ కుమార్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రానికి టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.