మ‌హేష్ సాంగ్‌ టైటిల్‌తో నాగ‌శౌర్య‌

Published On: February 12, 2018   |   Posted By:

మ‌హేష్ సాంగ్‌ టైటిల్‌తో నాగ‌శౌర్య‌

హీరోగానే కాదు నిర్మాత‌గా కూడా తొలి స‌క్సెస్ అందుకున్నాడు నాగ‌శౌర్య‌. ఐరా క్రియేష‌న్స్‌పై నాగ‌శౌర్య హీరోగా న‌టిస్తూ, నిర్మించిన చిత్రం `ఛ‌లో` బాక్సాఫీస్ వ‌ద్ద మంచి స‌క్సెస్‌ను అందుకుంది. త‌దుప‌రిగా నాగ‌శౌర్య రెండు సినిమాల‌ను లైన్‌లో పెట్టున్నాడు. అందులో ఒక‌టి సినిమాటోగ్రాఫ‌ర్ సాయిశ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక‌టి.. కాగా శ్రీనివాస్ అనే డెబ్యూ డైరెక్ట‌ర్‌తో `న‌ర్త‌న‌శాల‌` సినిమా రెండోది. ఈ రెండు సినిమాలు త‌ర్వాత నాగ‌శౌర్య మూడో సినిమా చేయ‌డానికి కూడా సిద్ధ‌మ‌వుతున్నాడ‌ని టాక్. వివ‌రాల్లోకెళ్తే.. 15 ఏళ్ల క్రితం త‌రుణ్‌, ఆర్తి అగ‌ర్వాల్ జంట‌గా వ‌చ్చిన `నువ్వు లేక నేను లేను` వంటి స‌క్సెస్ చిత్రాన్ని తెరెక్కించిన ద‌ర్శ‌కుడు కాశీ విశ్వ‌నాథ్ అంద‌రికీ సుప‌రిచితులే. ఈయ‌న ద‌ర్శ‌కుడిగా కంటే నటుడిగా ఫుల్ బిగా రాణిస్తున్నారు. ఇన్నేళ్ల త‌ర్వాత  కాశీ విశ్వ‌నాథ్ మ‌ళ్లీ మెగాఫోన్ ప‌ట్ట‌నున్నార‌ట‌. ఈ సినిమాకు మ‌హేష్ బాబు `దూకుడు`లోని `గురువారం మార్చి ఒక‌టి..` అనే పాట‌లో `గురువారం మార్చి ఒక‌టి` అనే టైటిల్ పరిశీన‌లో ఉంది. అయితే శౌర్య పై రెండు సినిమాలు పూర్త‌యిన త‌ర్వాతే ఈ సినిమా ట్రాక్ ఎక్కుతుంద‌ట మ‌రి.