మ‌హేష్ సినిమా కెమెరామెన్ త‌ప్పుకున్నాడు

Published On: December 13, 2017   |   Posted By:

మ‌హేష్ సినిమా కెమెరామెన్ త‌ప్పుకున్నాడు

ప్ర‌స్తుతం మ‌హేష్ హీరోగా న‌టిస్తున్న చిత్రం `భ‌ర‌త్ అను నేను`(రిజిష్ట‌ర్డ్ టైటిల్‌). ఈ సినిమాకు కొర‌టాల శివ ద‌ర్శ‌కుడు. `శ్రీమంతుడు` త‌ర్వాత మ‌హేష్‌బాబు, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.  ఈ సినిమా జ‌న‌వ‌రిలోనే రిలీజ్ అనుకున్నారు కానీ, చిత్రీక‌ర‌ణ‌తో విడుద‌ల ఆల‌స్య‌మైంది. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లోనే ఉంది. సినిమాను ఏప్రిల్ 27న విడుద‌ల చేస్తున్నారు. సినిమా అనుకున్న స‌మ‌యానికి పూర్తి కాక‌పోవ‌డం, ఇత‌ర క‌మిట్‌మెంట్స్ కారణంగా సినిమాటోగ్రాఫ‌ర్ ర‌వి.కె.చంద్ర‌న్ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్నాడ‌ని టాక్‌. ఇప్పుడు ఆయ‌న స్థానంలోకి కెమెరామెన్ తిరుతో సినిమాను పూర్తి చేయ‌బోతున్నారు. గ‌తంలో కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో తిరు `జ‌న‌తా గ్యారేజ్ ` సినిమాకు సినిమాటోగ్ర‌ఫీ అందించారు.