మ‌హేష్ హ‌వా మాములుగా లేదుగా

Published On: September 13, 2017   |   Posted By:

మ‌హేష్ హ‌వా మాములుగా లేదుగా

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు సినిమాలంటే.. ఓవ‌ర్‌సీస్ ప్రేక్ష‌కుల‌కు పండ‌గే. అక్క‌డ మ‌న ప్రిన్స్ సినిమాల‌కు మంచి డిమాండ్ ఉంటుంది. దూకుడు నుంచి ఓవ‌ర్‌సీస్‌లో త‌న స‌త్తా చాటుతున్న మ‌హేష్‌.. సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, 1-నేనొక్క‌డినే, శ్రీ‌మంతుడు చిత్రాల‌తో అక్క‌డ త‌న మార్కెట్ రేంజ్‌ని మరింత పెంచుకున్నాడు.

మ‌హేష్ కొత్త చిత్రం స్పైడ‌ర్‌కి ఓవ‌ర్‌సీస్‌లో మాములు డిమాండ్ లేదు. ఒక్క యుఎస్ఎలోనే  దాదాపు 800 థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది స్పైడ‌ర్‌. 600 థియేట‌ర్లు తెలుగు వెర్ష‌న్‌కి కాగా.. 150 కి పైగా థియేట‌ర్లు త‌మిళ వెర్ష‌న్‌కి కేటాయించారు. మొత్తానికి మ‌హేష్ హ‌వా.. ఓవ‌ర్‌సీస్ మార్కెట్‌లో మాములుగా లేదు. ద్విభాషా చిత్రంగా తెర‌కెక్కిన స్పైడ‌ర్ ఈ నెల 27న విడుద‌ల కానుంది. మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ న‌టించిన ఈ తొలి చిత్రంలో ఎస్‌.జె.సూర్య విల‌న్‌గా న‌టిస్తుండ‌గా, ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టించింది.