యండమూరి కధతో అర్జీవి చిత్రం తులసితీర్థం

Published On: November 25, 2021   |   Posted By:

యండమూరి కధతో అర్జీవి చిత్రం తులసితీర్థం

 

‘తులసిదళం’కి సీక్వెల్ గా తుమ్మలపల్లి నిర్మాతగా యండమూరి కధతో అర్జీవి చిత్రం “తులసితీర్థం”

 మూడు దశాబ్దాల క్రితం యావత్ తెలుగు పాఠకులను ఉర్రూతలూగించిన “తులసీదళం” నవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలకు ఎంతమాత్రం తీసిపోని ఫాలోయింగ్ తో స్టార్ రైటర్ గా నీరాజనాలందుకుని  మానసిక వికాస రచనలతో వేలాదిమంది జీవితాలను ప్రభావితం చేస్తున్న రచనా సంచలనం యండమూరి తాజాగా “తులసితీర్ధం” తీర్చిదిద్దారు. కాన్సెప్ట్ పరంగా ఇది ‘తులసిదళం”కు సీక్వెల్ కానుంది.

 

ఇప్పటివరకు తన సొంత కథలతో మాత్రమే సినిమాలు తీస్తూ  నిత్యం వివాదాల్లో ఉండే రాంగోపాల్ వర్మ తన కెరీర్ లో మొదటిసారి వేరే రచయిత సమకూర్చిన కథతో సినిమా రూపొందించేందుకు అంగీకరించారు. ఆ చిత్రం పేరు “తులసి తీర్ధం”.


భీమవరం  టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ “రేర్ కాంబినేషన్” చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా గ్రాఫిక్స్ తో నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అతి త్వరలో సెట్స్ కు వెళ్లనున్న ఈ హారర్ థ్రిల్లర్ కు సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలో వెల్లడి కానున్నాయి.