యాత్ర మూవీ రివ్యూ

Published On: February 8, 2019   |   Posted By:

యాత్ర మూవీ రివ్యూ

వైయస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అంతరాత్మ  -యాత్ర మూవీ రివ్యూ

రేటింగ్ :  2.5/5

అన్నేసి కోట్లు ఖర్చు పెట్టి ఎవరూ సరదాకొద్ది సినిమాలను తెరకెక్కించరు. డబ్బో, కీర్తో,..మరొకటో ..వేరకొటో సినిమా తీసేవాళ్ల లక్ష్యాల్లో ఉంటాయి. మరీ ముఖ్యంగా ఆత్మకథలను తెరకెక్కించటంలో సినిమావాళ్ల ఉద్దేశ్యం.. యువతకు ప్రేరేపించి, సొమ్ము చేసుకునే ఆలోచన ఉంటుంది. మరి పొలిటిషన్స్ బయోపిక్స్ అది ఎలక్షన్స్ దగ్గరకు వచ్చిన ఈ సందర్బంలో తెరకెక్కించి, మన ముందు పెట్టడంలో దర్శక,నిర్మాతల ఆలోచన ఏమై ఉంటుంది అనేది ఊహించటం మనకు పెద్ద కష్టమేమి కాదు. ఆల్రెడీ నందమూరి తారకరామారావు జీవిత జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్..కథనాయకుడు సినిమా వచ్చింది. జనాలని అలరించటంలో ఫెయిలైంది. ఇప్పుడు వైయస్ రాజకీయ జీవితంలో ప్రధాన ఘట్టమైన పాదయాత్రను బేస్ చేసుకుని సినిమా చేసారు. మరి ఈ సినిమా ఎంతవరకూ సామాన్యులను చేరుతుంది. పార్టికి ఏమన్నా పనికొచ్చే ప్రచార చిత్రం అవుతుందా…కమర్షియల్ గా వర్కవుట్ అవుతుందా..తెలుగుదేశం పార్టీపై ఏమన్నా విమర్శలు చేసారా వంటి విషయాలు రివ్యూలో పరిశీలిద్దాం. 

కథేంటి 

ముందుస్తు ఎన్నికలకు వెళ్లిన అప్పటి  అధికార పార్టీ  తెలుగుదేశం ని  ఓడించి అధికారం ఎలా చేజిక్కించుకోవాల‌నే విష‌యంలో అప్ప‌ట్లో జ‌రిగిన ఘటనలను ప్రారంభ స‌న్నివేశాల్లో చూపిస్తూ   క‌థ‌  మొద‌లు అవుతుంది. బలమైన అధికార పార్టీని ఎలా  ఎదుర్కోవాలా అని   వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి(మ‌మ్ముట్టి) టెన్షన్ గా ఉంటారు.  పార్టి ఫండ్స్ పెద్దగా లేవు. టైమ్ లేదు.  దానికి తోడు పార్టీ (కాంగ్రేస్) హైకమాండ్ …ఈయన నిర్ణయాలను విభేదిస్తూంటుంది. మరో ప్రక్క పార్టీలో గ్రూపిజం. కానీ వైయస్ ది మొండితనం కూడిన నిర్ణయాలు..మంచితనం, మానవత్వం…నమ్మిన వారి కోసం ఎంతదూరం అయినా వెళ్లే వ్యక్తిత్వం. ఇవి స్వతహాగా పార్టీ పెద్దలకు మింగుడుపడవు.  
ఏం చేయాలి అనుకున్న టైమ్ లో రైతుల కష్టాలు వైయస్ ని ఆలోచనలో పడేస్తాయి. అసలు రాష్ట్రంలో జనాల కష్ట,నష్టాలు  లైవ్ లో తెలుసుకోవాలనుకుంటారు. అందుకు ప్రజా ప్రస్దానం పేరుతో పాద యాత్ర మొదలెడతారు. హైకమాండ్ కాదన్నా, ప్రారంభంలో పెద్దగా రెస్పాన్స్ రాకున్నా ఎక్కడా వెనకడుగు వెయ్యడు. అదే ఆయన్ని విజయానికి దగ్గర చేస్తుంది. ముఖ్యమంత్రిని చేస్తుంది. అక్కడ నుంచి తను పాద యాత్రలో చూసిన ప్రజల కష్టాలు తీర్చే విధంగా వివిధ పథకాలు ప్రకటిస్తాడు. వాటి ప్రభావంతో రెండో సారి ముఖ్యమంత్రి అవుతాడు. చివరకు హైలికాప్టర్ ప్రమాదంలో అర్దాంతరంగా ఈ ప్రపంచానికి వీడ్కోలు చెప్తాడు. ఈ ప్రస్దానంలో వైయస్ మారిన తీరు, ప్రజల కష్టాలను తెలుసున్న విధానం, వ్యక్తిత్వంలో వచ్చిన మార్పలు ఏమిటి అనేది సినిమాని ఎమోషనల్ గా నిలబెట్టే అంశాలు. అవేమిటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే  తెలిసిన విషయమే అయినా.

తెలుగు రెండు రాష్ట్రాల్లోని చాలామందికి వైయస్ పాదయాత్ర, ఆయన పథకాలు ప్రతీ విషయం తెలుసు. అయితే తెలుసున్న విషయాలనే తెలివిగా స్క్రీన్ ప్లేలో అమర్చి దర్శకుడు జనరంజకంగా మార్చే ప్రయత్నం చేసారు. కానీ నిజ జీవిత  సంఘటనలు బేస్ చేసుకుని రాసిన కథ,కథనం కావటంతో చాలా చోట్ల డాక్యు డ్రామా అనే ఫీల్ వచ్చేసింది. 


అయితే వైయస్ అభిమానలకు డైరక్ట్ గా వైయస్ ని చూసిన ఫీల్ కలగేల చేయటంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. దాంతో వారి నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. వైయస్ గొప్పతనం చెప్పే సీన్స్ అయినా మరీ భజనలా కాకుండా ఎమోషనల్ జర్నీలా నడిపారు.అదే ప్లస్ పాయింట్ అయ్యింది.  

పార్టికి ప్లస్ అవుతుందా

ఇక ఈ సినిమా లక్ష్యం ఏమిటనేది సినిమా చూసిన ప్రతీ ఒక్కరికీ స్పష్టంగా అర్దమవుతుంది. అది వైయస్ జగన్ కు సపోర్ట్ ఇస్తూ…వైయస్ రోజులను గుర్తు చేయటం..తద్వారా పార్టీ కు ప్లస్ అయ్యి..ఓట్లుగా మారటం. అయితే  వైయస్ అభిమానలు ఎలాగూ దీన్ని చూసి మెచ్చుకుంటారు. కానీ వారికి అంతలా ఆకట్టుకుంటుందా..అంటే సందేహమే. కాబట్టి ఆ యాంగిలో పెద్దగా వర్కవుట్ కాదనే చెప్పాలి.   

టెక్నికల్ గా 

దర్శకుడు ఈ జనరేషన్ కు చెందిన టెక్నికల్ గా స్టాండర్డ్స్ ఉన్న వాడు కావటంతో ..బయోపిక్ ని బాగానే తీర్చిదిద్దాడు. టెక్నీషియన్స్ అందరినుంచీ మంచి అవుట్ ఫుట్ రాబట్టాడు. డైలాగ్స్ విషయంలో బాగా శ్రద్ద చూపించారని అర్దమవుతుంది. “నీళ్ళుంటే క‌రెంటు వుండ‌దు.. క‌రెంటు వుంటే నీళ్ళుండ‌వు..రెండూ ఉండి పంట చేతికొస్తే స‌రైన ధ‌ర వుండ‌దు. అంద‌రూ రైతే రాజంటారు..స‌రైన కూడు గూడు గుడ్డ నీడ లేని ఈ రాచ‌రికం మాకొద్ద‌య్య‌.. మ‌మ్మ‌ల్ని రాజులుగా కాదు క‌నీసం రైతులుగా బతకనివ్వండి’ అలాగే “నేను విన్నాను నేను వున్నాను’ లాంటి డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటాయి.

నటీనటుల్లో…

వై.ఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాత్ర‌లో మ‌మ్ముట్టి పరకాయ ప్రవేశం చేసారు. చూపలకు వై.ఎస్‌లా క‌నిపించ‌క‌పోయినా, చక్కని ఎమోషన్స్ ని ప్రదర్శిస్తూ…వైయస్ ని మన ముందు ఉంచారు. మరో ప్రక్క కేవీపీ పాత్రలో నటించిన రావు రమేష్, రాజా రెడ్డిగా కనిపించిన జగపతి బాబు, సబితా ఇంద్రారెడ్డిగా నటించిన సుహాసిని తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మరో ముఖ్య పాత్రలో కనిపించి పోసాని కూడా అదరకొట్టాడు.  వై.ఎస్‌.విజ‌య‌మ్మ పాత్ర‌లో ఆశ్రిత వేముగంటి చ‌క్క‌టి నటన  ప్ర‌ద‌ర్శించారు.   

హైలెట్స్ 

ఈ సినిమాలో ఫస్ట్ హైలెట్ ముమ్మట్టి. వేరే ఆర్టిస్ట్ ఎవరైనా అంత బాగా చేసి ఉండకపోదురేమో అనిపించింది. వైయస్ గురించి ఆయన ఎంత తెలుసుకున్నాడో కానీ…వైయస్ ని మాత్రం అలా దించేసారు. పార్టీ హైకమాండ్ ని థిక్కరించి అన్ని తానే పార్టీని నడిపేటప్పుడు చూపే మొండితనం , పాద యాత్రలో రైతుల కష్టాలకు ఎమోషనల్ గా స్పందించటం వంటి సీన్స్ లో ముమ్మట్టి నటనకు హ్యాట్సాఫ్ అనేస్తాం.   వైయస్ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతి బాబు, సబితా ఇంద్రరెడ్డి పాత్రలో సుహాసిని ఫెరఫెక్ట్ ఆప్షన్. సుచ‌రిత పాత్ర‌లో న‌టించిన అన‌సూయ‌ ఉన్నవి కొద్ది సీన్స్ అయినా కథలో కీలకంగా నిలిచింది.  విజయమ్మగా అశ్రిత వేముగంటి కనిపించి కొన్ని సీన్లైనా బాగా చేసారు. హస్పిటల్‌లో వైఎస్‌ఆర్‌ కళ్ల ముందే ఓ చిన్నారి ప్రాణాలొదలటం సీన్ కన్నీళ్లు పెట్టిస్తుంది.  

మైనస్ లు

డాక్యుమెంటరిలా కథను నడపటం, పాదయాత్రకే సినిమా ని పరిమితం చేయటం వైయస్ అభిమానులకు కాస్త ఇబ్బంది పెట్టే అంశాలే.    టీడీపిపై సెటైర్స్ రిలీజ్ కు ముందు కేవలం వైయస్ ప్రస్దానాన్నే చూపెడతారు అని అంతా భావించారు. అయితే సినిమాలో చాలా సన్నివేశాల్లో తెలుగుదేశం పార్టీపై సెటైర్స్ వేసారు. రైతులపై అప్పటి ప్రభుత్వం కాల్పులు జరిపించటం , ఓటుకు నోటు కేసుని గుర్తు చేసే  బ్రీఫ్‌డ్ మీ ని పెట్టారు. అయితే తెలుగుదేశం పార్టిని మనం దేశం పార్టి అని చెప్పారు. అలాగే ఎక్కడా చంద్రబాబుని చూపించకుండా జాగ్రత్త పడ్డారు.   

లాస్ట్ లైన్స్ 

వైయస్ అభిమానలకు విపరీతంగా నచ్చే ఈ సినిమా …రెగ్యులర్ సినీ గోయిర్స్ కు ఎక్కడం కష్టమే.  అదే వారి లక్ష్యం అయితే నెరవేరినట్లే ..సక్సెస్ అయినట్లే

తెర వెనక..ముందు

నిర్మాణ సంస్థ‌: 70 ఎం ఎం .తారాగ‌ణం: మమ్ముట్టి, రావు ర‌మేష్, జగపతిబాబు, సుహాసిని, అనసూయ, పోసాని, సచిన్ కడ్కర్, వినోద్ కుమార్, జీవా, 30 ఇయర్స్ పృథ్వి త‌దితరులు. కెమెరా: సత్యన్ సూర్యన్. మ్యూజిక్: కె ( క్రిష్ణ కుమార్ ). ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్. సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ప్రొడక్షన్ డిజైన్: రామకృష్ణ, మోనిక సబ్బాని. సౌండ్ డిజైన్: సింక్ సౌండ్. వి ఎఫ్ ఎక్స్: Knack Studios. సమర్పణ: శివ మేక. నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి. స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ : మహి వి రాఘవ్