యుద్ధం శరణం సెకెండ్ సింగిల్ రిలీజ్

Published On: August 23, 2017   |   Posted By:

యుద్ధం శరణం సెకెండ్ సింగిల్ రిలీజ్

రారండోయ్ వేడుక చూద్దాం లాంటి హిట్ మూవీ తర్వాత మరో కొత్త జానర్ లో నాగచైతన్య చేస్తున్న సినిమా యుద్ధంశరణం. కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రచార పర్వం ఇప్పటికే మొదలైంది. ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ కూడా విడుదల చేశారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఓ సింగిల్ కూడా లాంచ్ చేశారు. ఇప్పుడు సెకెండ్ సింగిల్ లాంచింగ్ కు టైం దగ్గరపడింది.

ఈసారి సినిమాకు మరింత హైప్ తీసుకురాబోతున్నారు. ఏకంగా యుద్ధం శరణం అనే టైటిల్ సాంగ్ ను విడుదల చేయబోతున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు యుద్ధం శరణం సినిమా టైటిల్ సాంగ్ ను విడుదల చేయబోతున్నారు.
ఈ సాంగ్ సూపర్ గా ఉంటుందని ప్రకటించాడు చైతూ. అలా ఒకే ఒక్క స్టేట్ మెంట్ తో మూవీపై అంచనాల్ని పెంచేశాడు.

ఓ టిపికల్ సబ్జెక్ట్ తో రాబోతోంది యుద్ధం శరణం సినిమా. నాగచైతన్య ఇప్పుడు డ్రోన్స్ స్పెషలిస్ట్ గా కనిపించబోతున్నాడు. అమ్మా-నాన్నతో అనుబంధం.. సిస్టర్ సెంటిమెంట్… ప్రేయసితో రొమాన్స్.. సెన్సిబుల్ కామెడీ.. ఇలా చాలా యాంగిల్స్ ఉన్నాయి ఈ సినిమాలో. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ గా కనిపించబోతున్నాడు.