యుద్ధం శ‌ర‌ణం మూవీ రివ్యూ

Published On: September 8, 2017   |   Posted By:

యుద్ధం శ‌ర‌ణం మూవీ రివ్యూ

అనాస‌క్తిగా `యుద్ధం.. శ‌ర‌ణం`

బ్యాన‌ర్ః వారాహి చ‌ల‌న‌చిత్రం

న‌టీన‌టులుః నాగ‌చైత‌న్య‌, లావ‌ణ్య త్రిపాఠి, శ్రీకాంత్‌, రావు ర‌మేష్‌, రేవ‌తి, ముర‌ళీశ‌ర్మ‌, ప్రియ‌ద‌ర్శి, ర‌వివ‌ర్మ త‌దిత‌రులు

ఎడిటింగ్ః క్రిపా క‌ర‌న్‌

మ్యూజిక్ః వివేక్ సాగ‌ర్‌

ర‌చ‌నః అబ్బూరి ర‌వి

సినిమాటోగ్ర‌ఫీః నికేత్ బొమ్మిరెడ్డి

నిర్మాతః ర‌జ‌నీకొర్ర‌పాటి

ద‌ర్శ‌క‌త్వంః కృష్ణ మారిముత్తు

Censor Rating:-“U/A”

Run Time:-141 minutes

అక్కినేని హీరోలంటే ప్రేమ‌క‌థా చిత్రాల క‌థానాయ‌కులు అనే ఇమేజ్ ఉంది. అదే ఇమేజ్‌తో కెరీర్ ప్రారంభించిన ఈ త‌రం అక్కినేని వార‌సుడు నాగ‌చైత‌న్య‌. హీరోగా చైతు ఏడేళ్ల అనుభ‌వ‌మున్న న‌టుడు. అయితే ప్రేమ‌క‌థా చిత్రాలు, ఫ్యామిలీ స‌బ్జెక్ట్స్‌ను ఎంపిక చేసుకుని, ట్రెండ్‌కి త‌గిన‌ట్లు సినిమాలు చేస్తూ వ‌స్తున్నాడు. అయితే చైతు ఈసారి గేర్ మార్చి కొత్త‌ద‌నం కోసం చేసిన సినిమా `యుద్ధం శ‌ర‌ణం`. ఈ సినిమాతో కృష్ణ మారిముత్తు అనే ద‌ర్శ‌కుడు ప‌రిచ‌యం కావ‌డం ఒక‌టైతే ఈ యువ ద‌ర్శ‌కుడు చైతుకు స్నేహితుడు కావ‌డం మ‌రో విషయం. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే చైతన్య ట్రాక్ మార్చి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్‌ను న‌మ్మి చేస్తోన్న సినిమా యుద్ధం శ‌ర‌ణం. మ‌రి ఈ చిత్రం చైత‌న్య‌కు ఎలాంటి స‌క్సెస్‌ను అందించిందో తెలుసుకోవాలంటే ముందు క‌థేంటో తెలుసుకుందాం…

క‌థ‌:

అర్జున్ (చెయ్ అక్కినేని) ఓ హ్యాపీ గోయింగ్ గై. త‌ల్లిదండ్రులు మిస్ట‌ర్ అండ్ మిసెస్ ముర‌ళీ(రావు ర‌మేశ్‌, రేవ‌తి) ఇద్ద‌రూ డాక్ట‌ర్లు కావ‌డంతో అత‌ని జీవితానికి వ‌చ్చిన ఢోకా ఏమీ ఉండ‌దు. త‌ల్లిదండ్రులు ఇచ్చిన కంఫ‌ర్ట్స్ ని  దృష్టిలో పెట్టుకుని చేస్తున్న ఉద్యోగాన్ని సైతం మానేసి, త‌న‌కు న‌చ్చిన డ్రౌన్ డిజైనింగ్‌లో బిజీ అవుతాడు. అనుకోకుండా వారి ఇంటికి అతిథిగా వ‌స్తుంది అంజ‌లి (లావ‌ణ్య త్రిపాఠి). ఆమె కూడా డాక్ట‌రే. అందుకే అర్జున్ త‌ల్లి ద‌గ్గ‌ర ఇంట‌ర్న్ షిప్ చేస్తుంటుంది. తొలిచూపులోనే అర్జున్‌, అంజ‌లి ప్రేమ‌లో ప‌డ‌తారు. ఆ విష‌యాన్ని అర్జున్ త‌ల్లిదండ్రులు, మిగిలిన కుటుంబ‌స‌భ్యులు గ్ర‌హిస్తారు. త‌మ ప్రేమ‌ను తండ్రితో చెప్పాల‌నుకుంటాడు అర్జున్‌. అంత‌లోనే త‌ల్లిదండ్రుల మ‌ర‌ణ‌వార్త‌ను వింటాడు. అప్ప‌టిదాకా సామాజిక సేవ చేయ‌డంలో ఎప్పుడూ ముందుండే ఆ కుటుంబం ఒక్క‌సారి స‌మాజంలో అనాథ‌గా మిగులుతుంది. వారి మ‌ర‌ణానికి నాయ‌క్‌కు ఉన్న సంబంధం ఏంటి? అస‌లు నాయ‌క్ ఎవ‌రు? ఎవ‌రి జోలికీ పోని ముర‌ళీ దంప‌తులకు మాఫియా ముఠాతో ఏర్ప‌డిన లింకు ఏంటి? అది వారి కుటుంబాన్ని ఎలా కుదిపేసింది? అనేది స‌స్పెన్స్.

ప్ల‌స్ పాయింట్స్

– నాగ‌చైత‌న్య‌, రావు ర‌మేశ్‌, శ్రీకాంత్‌, రేవ‌తి న‌ట‌న‌
– హీరో ప్రొఫెష‌న్ కొత్త‌గా ఉండ‌టం
– బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుండ‌టం
– చీక‌ట్లో వ‌చ్చే ఫైట్ సీక్వెన్స్

మైన‌స్ పాయింట్స్

– క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం
– ఫ్లాట్‌గా సాగే స్క్రీన్‌ప్లే
– సినిమాలో మాట‌ల్లో ఉన్న ఇంటెన్సిటీ తెర‌పై ఆవిష్కృతం కాక‌పోవ‌డం
– ఊహించిన క్లైమాక్స్
విశ్లేష‌ణ‌

నాగ‌చైత‌న్య ఈ మ‌ధ్య కాస్త స్పీడు మీదున్నాడు. మంచి సినిమాలు చేస్తున్నాడు. అక్టోబ‌ర్‌లో ఒకింటి వాడు కాబోతున్నాడు. ఈ మ‌ధ్య వార్త‌ల్లో ఉంటున్న నాగ‌చైత‌న్యకు బ్యాచ్‌ల‌ర్‌గా విడుద‌ల‌య్యే చివ‌రి సినిమా `యుద్ధం శ‌ర‌ణం`. టైటిల్ ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉండ‌టం, దానికి త‌గ్గ‌ట్టు శ్రీకాంత్ లుక్ కూడా సాల్ట్ అండ్ పెప్ప‌ర్‌గా ఉండ‌టం, సీనియ‌ర్లు చాలా మంది స్క్రీన్‌పై క‌నిపించ‌డంతో ఈ సినిమా మీద ఎక్స్ పెక్టేష‌న్స్ పెరిగాయి.

ఫ్యామిలీ ప‌ర‌మైన స‌న్నివేశాల‌ను క్యూట్‌గా తీసిన ద‌ర్శ‌కుడు మిగిలిన విష‌యాల‌ను కేప్చ‌ర్ చేయ‌డంలో కాస్త ఫెయిల్ అయ్యాడ‌నే విష‌యాన్ని అంగీక‌రించాల్సిందే. పాట‌ల మీద‌, కామెడీ మీద మ‌రింత శ్ర‌ద్ధ పెట్టాల్సిందేమో. ద‌ర్శ‌కుడు నెగ‌టివ్‌గా తీర్చిదిద్దిన ఏ పాత్ర మీద కూడా స‌రైన ఫోక‌స్ చేయ‌లేక‌పోయాడ‌న్న‌ది అంగీక‌రించాల్సిన విష‌యం. ల‌వ‌ర్‌బోయ్‌గా మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నాగ‌చైత‌న్య యాక్ష‌న్ హీరోగా చేసిన ఈ ప్ర‌య‌త్నం కూడా పెద్ద‌గా స‌ఫ‌లీకృతం కాలేద‌న్న‌ది అంగీక‌రించాల్సిన వాస్త‌వం.

ఫైన‌ల్ వ‌ర్డ్: యుద్ధం.. శ‌ర‌ణం.. రెండూ ఆస‌క్తిగా లేవు

రేటింగ్‌: 2.5/5