“యురేక” మూవీ రివ్యూ

Published On: March 13, 2020   |   Posted By:

“యురేక” మూవీ రివ్యూ

ఓ వెర్రి కేక …(యురేక రివ్యూ)
Rating:1.5/5

నిజానికి ఇది సినిమాలకు అన్ సీజన్. ఓ ప్రక్కన పరీక్షలు..మరో ప్రక్కన కరోనా వైరస్ జనాలను థియోటర్స్ కు దూరం పెడుతున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో ఓ సినిమాని రిలీజ్ చేస్తున్నారంటే ఆ సినిమాపై వాళ్లకు మితిమీరిన నమ్మకం అయినా ఉంండాలి లేదా..వదిలించుకునేందుకు రిలీజ్ చేస్తున్నారని అనైనా అనుకోవాలి. ఇలాంటి అనిశ్చితి పరిస్దితుల్లో రిలీజైన ఈ చిత్రాన్ని దర్శక,నిర్మాతలు ఏ నమ్మకంతో రిలీజ్ చేసారు. అంత విషయం ఉన్న సినిమానా లేక కేవలం ఏదో రిలీజ్ చేసాం అనుకోవటానికి చేసారా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్…
అదో కాలేజీ. అక్కడ రెండు గ్రూప్ లు.  యువ (కార్తీక్ ఆనంద్), రేవంత్ (మున్నా) లు ఆ గ్రూప్ లీడర్స్. ఆ గ్రూప్ ల మధ్య ఆధిపత్య పోరు నిరవధికంగా నడుస్తూ ఉంటుంది. దాంతో ఒకరిపై మరొకరు ఆధిపత్యం కోసం గ్యాంగ్ వార్స్ కూడా జరుగుతూంటాయి. ఆ  గ్యాంగ్స్ మధ్య గొడవలు  కాలేజ్ యానివర్శరీ నాడు పీక్స్ చేరుతాయి. ఈ క్రమంలో జరిగిన  కొన్ని నాటకీయ పరిణామాలతో…ఓ డెడ్ బాడీని కాలేజీ ఆఫీస్ లో దాచి పెట్టాల్సి వస్తుంది. అక్కడ నుంచి ఏం జరిగింది. అసలా డెడ్ బాడీ ఎవరిది? యువ, రేవంత్ ల ఆధిపత్య పోరులో ఎవరు గెలిచారు? అనేది మిగతా కథ..

స్క్రీన్ ప్లే సంగతి
హాలీవుడ్ థ్రిల్లర్ కామెడీ సినిమాల ప్రేరణతో రాసుకున్నట్లు ఉన్న ఈ కథ ఫన్, సస్పెన్స్ ప్రధానంగా నడపాలని దర్శకుడు ప్రయత్నించాడు. అందులో కొంత భాగమే సక్సెస్ అయ్యాడు. అలాగే మన నేటివిటికి బాగా దూరంగా ఈ కథ ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కాలేజీల్లో పరిస్దితులు మారిపోయాయి. ఆదిపత్యాలు,పోరాటాలు వంటివన్నీ దాదాపు ముగిసిపోయి రెండు దశాబ్దాలు పైగానే అయ్యింది. దాంతో ఈ కథ చూస్తూంటే ఎప్పుడో పాత రోజుల్లో జరిగినట్లు అనిపిస్తుంది. ఇక కాలేజీ ఆఫీస్ లో డెడ్ బాడీని దాచటం వంటి సీన్స్ కన్వీసింగ్ గా అనిపించవు. హీరో నే దర్శకుడుగా మారి చేసిన ఈ సినిమా స్క్రీన్ ప్లే పరంగా నీరసంగా సాగుతుంది. ఎక్కడా ప్రేక్షకుడుకి పంచ్ ఇవ్వదు. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది కానీ ఆ తర్వాత దాన్ని సస్టైన్ చేయలేకపోయారు.  అలాగే ఫస్టాఫ్ ఎండ్ లో ట్విస్ట్ పెట్టుకుని అక్కడదాకా సీన్స్ ఫిల్ చేసుకుంటూ వెళ్లిపోయారు. తప్ప సీన్ ఆఫ్ ఇంట్రస్ట్ క్రియేట్ చేయలేకపోయారు. సెకండాఫ్ కూడా సోసో గా సాగింది.

దర్శకత్వం, మిగతా విభాగాలు

నటీనటులు ఎవరూ ఈ సినిమాలో అదిరిపోయే ఫెరఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు. దర్శకత్వ వైఫల్యం కొట్టచ్చినట్లు కనపడుతుంది చాలా సీన్స్ లో. హీరోయిన్స్ గా నటించిన షాలిని, డింపుల్ హయాతి జస్ట్ఓకే.  కాలేజీ ప్రొఫెసర్ గా బ్రహ్మాజీ నవ్వించాడు. నటుడు రఘు బాబు, పెళ్లి చూపులు ఫేమ్ అజయ్ నటనా ఈ సినిమాలో కాస్తంత రిలీఫ్.

 కాలేజీకి   వెళ్లే యూత్ ని టార్గెట్ చేసారని అనుకుని స్క్రిప్టు రాసుకున్నా…వారిని సైతం ఆకట్టుకోదు. మిగతా వారికి బోర్ గా అనిపిస్తుంది. కెప్టెన్ ఆఫ్ ది షిప్ సరిగ్గా లేకపోతే మిగతా విభాగాలు ఎంత గొప్పగా ఉన్నా పెద్దగా ఫలితం ఉండదు. అదే ఇక్కడా జరిగింది. మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నా…కెమెరా వర్క్ ఓకే అనిపించినా…ఇవన్నీ హైలెట్ కాలేదు. ఎడిటర్ కూడా సినిమాని బోర్ కొట్టించటానికి తనవంతు సాయిం చేసాడు.

చూడచ్చా..
జస్ట్ ఓకే కూడా అనిపించని ఈ సినిమా…చూడమని ధైర్యంగా రికమెండ్ చేయలేం.

ఎవరెవరు..

నటీనటులు: కార్తీక్ ఆనంద్, డింపుల్ హయతి,సయ్యద్ సోహైల్ రియాన్,షాలిని సమీక్ష, బ్రహ్మాజీ ,రఘుబాబు, శివన్నారాయణ, వాసు, అభయ్, రాకెట్ రాఘవ, మహేష్ విట్టా, మస్త్ అలీ ఆర్.కె,వేణుగోపాల్ రావు, కొటేష్ తదితరులు.
 సంగీతం: నరేష్ కుమరన్
డివోపి: ఎన్.బి. విశ్వకాంత్
ఎడిటింగ్: గ్యారీ బి.హెచ్, అనిల్ కుమార్.పి
ఆర్ట్: అవినాష్ కొల్ల
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కృష్ణారెడ్డి
లైన్ ప్రొడ్యూసర్: బి.ఆర్.ఎస్.టి.సాయి
సాహిత్యం: రామాంజనేయులు
దర్శకత్వం: కార్తీక్ ఆనంద్
నిర్మాత: ప్రశాంత్ తాత
సహా నిర్మాత: లలిత కుమారి బొడ్డుచర్ల