యువ హీరోల‌తో ఆనంద ప్ర‌సాద్

Published On: March 14, 2018   |   Posted By:

యువ హీరోల‌తో ఆనంద ప్ర‌సాద్

భ‌వ్య క్రియేష‌న్స్ అధినేత వి. ఇప్పుడు నిర్మాత‌గా వ‌రుస సినిమాల‌ను ప్లాన్ చేసుకుంటున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఇద్ద‌రు యువ హీరోల‌తో భ‌వ్య క్రియేష‌న్స్ సినిమా చేయ‌నుంది. అందులో ఒక‌రు నాగ‌శౌర్య‌. ఈ సినిమాకు సంబంధించిన క‌థా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే ఓ క్లారిటీ రానుంది. అలాగే ఎనర్టిటిక్ స్టార్ రామ్‌, ప్ర‌వీణ్ స‌త్తారు కాంబినేష‌న్‌లో కూడా సినిమా చేయ‌నుంది. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. అలాగే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా శ‌రవేగంగా జ‌రుగుతున్నాయి. వ‌చ్చే నెల‌లో ఈ సినిమాకు సంబంధించిన విష‌యాల‌ను అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు.