యు.ఎస్‌లో  గూఢ‌చారి

Published On: February 20, 2018   |   Posted By:

యు.ఎస్‌లో  గూఢ‌చారి

క్ష‌ణం చిత్రంతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న అడివిశేష్ ప్ర‌స్తుతం `గూఢ‌చారి` అనే సినిమాలో న‌టిస్తున్నాడు. ‘అమీ తుమీ’ వంటి విభిన్న చిత్రాలతో విజయం అందుకున్న అడివి శేష్ ఈ సారి స్పై థ్రిల్లర్ తో మనముందుకు రానుండటం విశేషం. శశికిరణ్ తిక్క ఈ చిత్రానికి దర్శకుడు. తుపాకులు, బులెట్ లతో అధునాతనంగా డిజైన్ చేయబడిన ‘గూఢచారి’ ఫస్ట్ లుక్ పోస్టర్ చిత్రంపై ఆసక్తిని రేకెత్తించింది. ఓ మంచి కాన్సెప్ట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అడివి శేష్ గూఢచారిగా కనిపిస్తారు. అడివి శేష్ సరసన శోభిత ధూళిపాళ హీరోయిన్ గా నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, విస్టా డ్రీం మిర్చంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేసవికి విడుదల చేయు సన్నాహాలు చేస్తున్నారు.  ఇప్ప‌టికే ఈ చిత్రం ఢిల్లీ, అస్సాం, మేఘాలయ, బంగ్లాదేశ్ వంటి ప్రదేశాల్లో  షూటింగ్ జరుపుకుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా కథానుసారం కొంత పార్టును అమెరికాలో చిత్రీకరించాల్సి ఉంది. అందుకే చిత్ర యూనిట్‌తో పాటు అడివి శేష్‌ కూడా అమెరికా పయనమయ్యారు. కొత్త షెడ్యూల్ అమెరికాలో జ‌ర‌గ‌నుంది. ఈ సినిమా త‌ర్వాత విన‌ప‌డుతున్న స‌మాచారం  హిందీ చిత్రం `2 స్టేట్స్`ను  తెలుగులో రీమేక్‌లో న‌టించ‌బోతున్నాడు మ‌రి.