యూఎస్ టాప్-4లో చేరిన ఫిదా సినిమా

Published On: July 27, 2017   |   Posted By:
యూఎస్ టాప్-4లో చేరిన ఫిదా సినిమా
శేఖర్ కమ్ముల-వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ఫిదా సినిమా ఓవర్సీస్ లో సూపర్ హిట్ అయింది. వర్కింగ్ డేస్ లో కూడా ఈ సినిమాకు అక్కడ మంచి వసూళ్లు వస్తుండడం విశేషం.  విడుదలైన ఈ వారం రోజుల్లో ఫిదా సినిమా ఏకంగా టాప్-10 లిస్ట్ లోకి చేరింది. అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో ప్రస్తుతానికి నాలుగో స్థానంలో నిలిచింది ఫిదా.
ఓవర్సీస్ టాప్ గ్రాసర్స్ లో మొదటి స్థానం బాహుబలి-2ది కాగా.. రెండోస్థానంలో ఖైదీనంబర్ 150, మూడో స్థానంలో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలు కొనసాగుతున్నాయి. మొన్నటివరకు నాలుగో స్థానంలో నాని నటించిన నిన్నుకోరి సినిమా ఉండగా… తాజాగా ఆ స్థానాన్ని ఫిదా ఆక్రమించింది. ప్రస్తుతం అమెరికాలో ఈ సినిమా దాదాపు 12 లక్షల డాలర్ల వసూళ్లతో కొనసాగుతోంది.
ఫిదా సినిమాతో ఓవర్సీస్ లో వరుణ్ తేజ్ కు కూడా మార్కెట్ క్రియేట్ అయింది. ప్రస్తుతం వెంకట్ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఓవర్సీస్ లో ఈ సినిమా భారీ రేటుకు అమ్ముడుపోయే అవకాశం  ఉంది.