య‌న్‌.టి.ఆర్‌ లో మ‌హేశ్‌

Published On: April 10, 2018   |   Posted By:

య‌న్‌.టి.ఆర్‌ లో మ‌హేశ్‌

మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు బ‌యోపిక్ `య‌న్‌.టి.ఆర్‌` రీసెంట్‌గా స్టార్ట‌య్యింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఎన్టీఆర్ పుట్టిన‌ప్ప‌టి నుండి రాజకీయాల్లో ముఖ్య‌మంత్రిగా పీఠాన్ని అధిరోహించే దాక‌.. సినిమా ఉంటుంది. ఈ సినిమాను తెలుగు, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కించ‌నున్నారు. భారీ తారాగ‌ణం సినిమాలో న‌టించ‌నుంది. ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుగా రానా ద‌గ్గుబాటి న‌టించ‌బోతున్నారని.. అలాగే నాదెండ్ల భాస్క‌ర‌రావుగా ప‌రేశ్ రావల్‌… శ్రీదేవిగా దీపికా పదుకొనె.. ఇలా ప‌లువురి పేర్లు విన‌ప‌డుతున్నాయి. కానీ ఏదీ అధికార‌కం కాలేదు. ఇప్పుడు ఇందులో టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ న‌టించ‌బోతున్నార‌ట‌. ఎన్టీఆర్‌కు సినిమాల్లో పోటీనిచ్చిన హీరోల్లో సూప‌ర్‌స్టార్ కృష్ణ ఒక‌రు. ఎన్టీఆర్‌ ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత కృష్ణ ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా సినిమాలు కూడా తీశారు. అయితే ఇద్ద‌రూ మంచి స్నేహితులు కూడా. ఇక `య‌న్‌.టి.ఆర్‌` బ‌యోపిక్‌లో సూప‌ర్‌స్టార్ కృష్ణ పాత్ర‌లో మ‌హేశ్ అతిథి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ విష‌యాల‌పై స‌మాచారం బ‌య‌ట‌కు తెలుస్తుంది.