రంగస్థలంలో ఆది పినిశెట్టి పాత్ర ఇదే

Published On: March 13, 2018   |   Posted By:

రంగస్థలంలో ఆది పినిశెట్టి పాత్ర ఇదే

రంగస్థలం సినిమాకు సంబంధించి ఇప్పటివరకు రెండంటే రెండు పాత్రలు మాత్రమే బయటకొచ్చాయి. చిట్టిబాబుగా రామ్ చరణ్, రామలక్ష్మిగా సమంత మాత్రమే ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇక వీళ్లిద్దరి పాత్రల పరిచయంతోనే ఆపేస్తారని, నేరుగా థియేటర్లలోకి వచ్చేస్తారని అంతా అనుకున్నారు. కానీ తాజాగా ఆది పినిశెట్టి పాత్రను విడుదల చేశారు. రంగస్థలం సినిమాలో కుమార్ బాబు అనే పాత్రలో ఆది కనిపించనున్నాడు.

“రంగస్థలం గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ప్రెసిడెంట్ అభ్యర్థిగా గ్రామ ప్రజలు బలపరిచిన కె.కుమార్ బాబు లాంతరు గుర్తుకే మీ ఓటు ముద్రను వేసి గెలిపించండి.” ఈ క్యాప్షన్ తో ఆది ఉన్న ఫొటోను పెట్టి ఓ స్టిల్ ను విడుదల చేశారు. ఫొటోలో 80ల కాలానికి చెందిన హెయిర్ స్టయిల్, అద్దాలతో ఆది కొత్తగా కనిపిస్తున్నాడు. ఇక తాజాాగా విడుదలైన స్టిల్ చూస్తుంటే.. ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతుందని విషయం అర్థమౌతోంది.