రంగస్థలం ఆడియో రైట్స్ డీల్

Published On: January 17, 2018   |   Posted By:

రంగస్థలం ఆడియో రైట్స్ డీల్

ఒక సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నాడంటే చాలు, ఆ సినిమా ఆడియో రైట్స్ కు డిమాండ్ పెరుగుతుంది. టాలీవుడ్ లో దేవిశ్రీకి ఉన్న క్రేజ్ అలాంటిది. తాజాగా ఈ సంగీత దర్శకుడు మ్యూజిక్ అందిస్తున్న సినిమా రంగస్థలం. ఈ సినిమా ఆడియో రైట్స్ అగ్రిమెంట్ పూర్తయింది. లహరి మ్యూజిక్ సంస్థ కోటి 60 లక్షల రూపాయలకు (జీఎస్టీ అదనం) రంగస్థలం ఆడియో రైట్స్ ను దక్కించుకుంది.

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీ-రిలీజ్ బిజినెస్ ప్రారంభమైంది. నైజాం రైట్స్ ను యూవీ క్రియేషన్స్ సంస్థ దక్కించుకుంది. ఉత్తరాంధ్ర హక్కుల్ని ఏవీ సినిమాస్ దక్కించుకుంది. కీలకమైన సీడెడ్ ఏరియాలో సొంత రిలీజ్ కు వెళ్లడానికి ప్లాన్ చేస్తోంది మైత్రీ మూవీస్ నిర్మాణ సంస్థ. మార్చి 30న థియేటర్లలోకి రానుంది రంగస్థలం.