రంగస్థలం ప్రీ-రిలీజ్ బిజినెస్ లేటెస్ట్ అప్ డేట్స్

Published On: February 7, 2018   |   Posted By:

రంగస్థలం ప్రీ-రిలీజ్ బిజినెస్ లేటెస్ట్ అప్ డేట్స్

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న రంగస్థలం సినిమాకు సంబంధించి ఇప్పటికే శాటిలైట్, ఆడియో, డిజిటల్ స్ట్రీమింగ్, ఓవర్సీస్ రైట్స్ లాంటివి పూర్తయ్యాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలకమైన రెండు ప్రాంతాల రైట్స్ ను ఓ కొలిక్కి తీసుకువచ్చారు.

రంగస్థలం సినిమాతో నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్ లో అడుగుపెడుతోంది యూవీ క్రియేషన్స్ సంస్థ. ఈ మూవీ నైజాం థియేట్రికల్ రైట్స్ ను 18 కోట్ల రూపాయలకు దక్కించుకున్నాడు యూవీ నిర్మాత ప్రమోద్. ఇక సీడెడ్ విషయానికొస్తే ఈ ఏరియా రైట్స్ ను ఏకంగా ముగ్గురికి అప్పగించారు. బళ్లారితో కలుపుకొని సీడెడ్ డీల్ క్లోజ్ చేశారు. ఈ మొత్తం 12 కోట్ల రూపాయలు. బళ్లారి ఏరియాను మాత్రం సాయి కొర్రపాటి కొనుగోలు చేశారు.

ప్రస్తుతానికి రంగస్థలం సినిమాకు సంబంధించి ఆంధ్రా మాత్రం బ్యాలెన్స్ ఉంది. ప్రస్తుతానికి అడ్వాన్స్ లు, ఎన్ఆర్ లపై చర్చలు సాగుతున్నాయి. మరో 10 రోజుల్లో ఆంధ్రా డీల్ కూడా క్లోజ్ చేయబోతున్నారు.