రంగస్థలం ఫస్ట్ సాంగ్ రివ్యూ

Published On: February 14, 2018   |   Posted By:

రంగస్థలం ఫస్ట్ సాంగ్ రివ్యూ


సుకుమార్, దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ ఫెయిల్ అవ్వదనే సెంటిమెంట్ మరోసారి నిజమైంది. రంగస్థలం సినిమాకు సంబంధించి  విడుదల చేసిన సాంగ్ అదిరిపోయింది. ఎంత సక్కగున్నావే అనే లిరిక్స్ తో సాగే ఈ పాటను విన్న ప్రతి ఒక్కరు ‘ఎంత సక్కగుందో’ అని మురిసిపోతున్నారు.

సుకుమార్ సినిమాలకు సంబంధించి దేవిశ్రీ ఎప్పుడూ డిసప్పాయింట్ చేయడనే విషయం ఈ పాటతో మరోసారి రుజువైంది. ఈ ట్యూన్ దేవిశ్రీకి ఎంతలా నచ్చిందంటే..  పాటను స్వయంగా అతడే ఆలపించాడు. పాట కంపోజిషన్ మెలొడియస్ గా, చాలా బాగుందనేది ఒకెత్తయితే.. ఈ పాటకు చంద్రబోస్ అందించిన సాహిత్యం మరో ఎత్తు. పాటతో సమానంగా సాహిత్యం గురించి కూడా అంతా మాట్లాడుకుంటున్నారంటే.. అది చంద్రబోస్ గొప్పదనమే.

కేవలం సాంగ్ మాత్రమే కాదు.. ఈ లిరికల్ వీడియోలో చూపించిన సినిమా స్టిల్స్ కూడా ఎంతో సక్కగున్నాయి. ఇందులో కొన్ని చూసేసినవి ఉన్నాయి. మరికొన్ని కొత్తవి ఉన్నాయి. ఇంకొన్ని ఆమధ్య లీక్ అయినవి ఉన్నాయి. మొత్తమ్మీద అన్నీ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఓవరాల్ గా రంగస్థలం ప్రాజెక్టుకు ఈ పాటతో ఓ కొత్త ఊపు వచ్చింది.