రంగస్థలం బాటలో భరత్ అనే నేను సినిమా

Published On: April 17, 2018   |   Posted By:
రంగస్థలం బాటలో భరత్ అనే నేను సినిమా
రంగస్థలం సినిమా 3 గంటల నిడివి ఉందన్నప్పుడు చాలామంది పెదవి విరిచారు. ఇంత పెద్ద సినిమా క్లిక్ అవుతందా అని అనుమానాలు వ్యక్తంచేశారు. కానీ రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు అదే ఫార్ములాని భరత్ అనే నేను సినిమా కూడా ఫాలో అవుతుంది. మహేష్, కొరటాల కాంబోలో వస్తున్న ఈ సినిమా కూడా 3 గంటల నిడివి  ఉంది. అయినప్పటికీ మేకర్స్ లో ఎక్కడా భయంలేదు.
భరత్ అనే నేను సినిమా డ్యూరేషన్ 2 గంటల 53 నిమిషాలు ఉన్నట్టు నిర్మాత డీవీవీ దానయ్య ప్రకటించాడు. కథ ప్రకారం అంత నిడివి ఉండాల్సి వచ్చిందని, కథలో చాలా ఎమోషన్ ఉందని, మరీ ముఖ్యంగా సెకెండాఫ్ అద్భుతంగా ఉంటుందని అంటున్నాడు. రంగస్థలం ఎలా అయితే ఆడియన్స్ ను కూర్చోబెట్టిందో, భరత్ అనే నేను సినిమా కూడా డ్యూరేషన్ ఎక్కువైందనే భావనను ప్రేక్షకులకు కలిగించదని అంటున్నారు నిర్మాత.