రంగస్థలం సినిమా నుంచి రంగమ్మ మంగమ్మ సాంగ్ రివ్యూ

Published On: March 9, 2018   |   Posted By:

రంగస్థలం సినిమా నుంచి రంగమ్మ మంగమ్మ సాంగ్ రివ్యూ


లిరిక్స్ చూసి ఇదేదో ఐటెంసాంగ్ అనుకున్నారు చాలామంది. పైగా టోటల్ సినిమాకు ఈ పాటే హైలైట్ అని యూనిట్ చెబుతూ వచ్చింది. ఇప్పటికే విడుదలైన 2 సాంగ్స్ సూపర్ హిట్ అవ్వడం, మూడో పాట హైలెట్ అంటూ యూనిట్ చెప్పడంతో రంగస్థలం మూడో సింగిల్ పై అంచనాలు ఆకాశాన్నంటాయి. మరి తాజాగా విడుదలైన ఈ సింగిల్ ఎలా ఉందో చూద్దాం.

రంగమ్మ-మంగమ్మ అనే లిరిక్స్ తో సాగే ఈ పాట ఐటెంసాంగ్ కాదు. రామ్ చరణ్ తనను పట్టించుకోవట్లేదని బాధపడుతూ, అతడిపై ఉన్న ప్రేమను కాస్త కోపంగా ప్రదర్శించే పాటిది. 80ల నాటి వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగానే ఈ పాట కూడా ఉంది. కాకపోతే ముందు విడుదలైన 2 పాటలకు తగ్గ రేంజ్ లో మాత్రం కచ్చితంగా లేదు.

మొదటి రెండు పాటలకు సాహిత్యం అందించిన చంద్రబోసే.. రంగమ్మ-మంగమ్మ సాంగ్ కు కూడా లిరిక్స్ సమకూర్చాడు. ఈ సాహిత్యానికి దేవిశ్రీప్రసాద్ ఫోక్ స్టయిల్ లో బాణీకడితే.. ఆ ఫ్లేవర్ ఎక్కడా మిస్ అవ్వకుండా ఆలపించింది సింగర్ ఎమ్.ఎమ్ మానసి. ఓవరాల్ గా ఈ పాట కూడా సినిమాపై ఓ మోస్తరు అంచనాలు పెంచింది తప్ప తగ్గించలేదు.