రంగస్థలం 17 రోజుల వసూళ్లు

Published On: April 16, 2018   |   Posted By:
రంగస్థలం 17 రోజుల వసూళ్లు
నిన్నటితో 17 రోజుల రన్ పూర్తిచేసుకున్న రంగస్థలం సినిమా మరో అరుదైన రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా 175 కోట్ల రూపాయల గ్రాస్ సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. తెలుగులో బాహుబలి-2, ఖైదీ నంబర్ 150 తర్వాత 175 కోట్ల రూపాయల గ్రాస్ సాధించిన చిత్రం రంగస్థలం మాత్రమే. ఈ సినిమాతో సరికొత్త ఇండస్ట్రీ రికార్డు సృష్టించాడు రామ్ చరణ్. తాజా ట్రెండ్స్ ప్రకారం చూస్తుంటే.. రంగస్థలం సినిమా ఊపు మరో వారం రోజులు ఇలానే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏపీ, నైజాం 17 రోజుల షేర్
నైజాం – రూ. 23.40 కోట్లు
సీడెడ్ – రూ. 15.20 కోట్లు
ఉత్తరాంధ్ర  – రూ. 11.21 కోట్లు
ఈస్ట్ – రూ. 6.69 కోట్లు
వెస్ట్ – రూ. 5.30 కోట్లు
గుంటూరు – రూ. 7.51 కోట్లు
కృష్ణా – రూ. 6.19 కోట్లు
నెల్లూరు – రూ. 2.90 కోట్లు

Leave a Reply

Your email address will not be published.