రంగస్థలం 18 రోజుల వసూళ్లు

Published On: April 17, 2018   |   Posted By:
రంగస్థలం 18 రోజుల వసూళ్లు
థియేటర్లలో రంగస్థలం డ్రీమ్ రన్ కొనసాగుతోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ 175 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా.. రోజురోజుకు మరిన్ని వసూళ్లు పెంచుకుంటోంది. బాహుబలి-2, బాహుబలి-1 సినిమాల తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచిన రంగస్థలం.. ఈ వారాంతానికి మరో 20 కోట్లు సంపాదిస్తుందని అంచనా వేస్తున్నారు. నిన్నటితో 18 రోజుల రన్ పూర్తిచేసుకున్న రంగస్థలం సినిమా వసూళ్లు ఈ కింది విధంగా ఉన్నాయి.
ఏపీ, నైజాం 18 రోజుల షేర్
నైజాం – రూ. 23.80 కోట్లు
సీడెడ్ – రూ. 15.40 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 11.29 కోట్లు
ఈస్ట్ – రూ. 6.76 కోట్లు
వెస్ట్ – రూ. 5.38 కోట్లు
గుంటూరు – రూ. 7.59 కోట్లు
కృష్ణా – రూ. 6.28 కోట్లు
నెల్లూరు – రూ. 2.94 కోట్లు