రంగులరాట్నం మూవీ రివ్యూ

Published On: January 14, 2018   |   Posted By:

రంగులరాట్నం మూవీ రివ్యూ

నటీనటులు – రాజ్‌తరుణ్‌, చిత్రా శుక్లా, సితార, ప్రియదర్శి తదితరులు
సంగీతం –  శ్రీచరణ్‌ పాకాల
సినిమాటోగ్రఫీ –  ఎల్‌.కె.విజయ్‌
ఎడిటింగ్‌ – శ్రీకర్‌ప్రసాద్‌
ఆర్ట్‌ –  పురుషోత్తం ఎం.
నిర్మాణం –  అన్నపూర్ణ స్టూడియోస్‌
దర్శకత్వం –  శ్రీరంజని
సెన్సార్ – యు-సర్టిఫికేట్
విడుదల తేదీ – జనవరి 14, 2018
సంక్రాంతి రేసులోకి సడెన్ గా ఎంటరైంది రంగులరాట్నం. ప్రతి సంక్రాంతికి ఓ చిన్న సినిమా ఉన్నట్టే ఈ సంక్రాంతికి కూడా రంగులరాట్నం రెడీ అయింది. అజ్ఞాతవాసి, జై సింహా లాంటి రెండు పెద్ద సినిమాల మధ్య వచ్చిన రంగులరాట్నంలో రాజ్ తరుణ్ హీరోగా నటించాడు. మరి ఈ హీరోకు సంక్రాంతి కలిసొచ్చిందా..
కథ
ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో చిన్న ఉద్యోగం చేస్తుంటాడు విష్ణు (రాజ్ తరుణ్). తండ్రి చిన్నతనంలోనే చనిపోతాడు. తల్లి (సితార) గారాబంగా పెంచుతుంది. మిడిల్ క్లాస్ కుటుంబం కావడంతో రాజ్ తరుణ్ కు తొందరగా పెళ్లి చేయాలనుకుంటుుంది తల్లి. అమ్మాయిల్ని వరుసపెట్టి చూపిస్తుంటుంది. కానీ రాజ్ తరుణ్ మాత్రం ఒప్పుకోడు. ఓ సందర్భంలో కీర్తిని (చిత్రా శుక్లా) చూసి ఇష్టపడతాడు. అమ్మ (సితార)కు కూడా పరిచయం చేస్తాడు. తన కొడుకు ప్రేమిస్తున్నాడనే విషయాన్ని హీరోయిన్ కు చెప్పేస్తుంది సితార. చిత్ర వెంటనే ఒప్పుకోదు కానీ మనసులో ఇష్టం
ఉంటుంది. రాజ్ తరుణ్ కు ఈ విషయం చెప్పకూడదని ఇద్దరూ నిర్ణయించుకుంటారు.
కట్ చేస్తే ఇంటర్వెల్ టైమ్ కు రాజ్ తరుణ్ తల్లి చనిపోతుంది. హీరోయిన్ కు తన ప్రేమ విషయం అమ్మ చెప్పిందనే విషయం రాజ్ తరుణ్ కు తెలీదు. తల్లి చనిపోవడంతో ఆ లోటు లేకుండా చూసుకోవాలనుకుంటుంది హీరోయిన్ చిత్ర. రాజ్ తరుణ్ కు సంబంధించిన అన్ని విషయాల్లో చాలా కేర్ తీసుకుంటుంది. బయట ఫుడ్ తిననివ్వదు. తాగి డ్రైవ్
చేయనివ్వదు. రాత్రిళ్లు తొందరగా పడుకోబెడుతుంది. ఇలా ఎన్నో అతి జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ అతి జాగ్రత్త రాజ్ తరుణ్ కు నచ్చదు. ఒకదశలో చిరాకు ఎత్తి హీరోయిన్ ను వదిలేస్తాడు. ఆఖరి నిమిషంలో చనిపోయిన తన తల్లి మొబైల్ లోని వాయిస్ మెసేజీలు వింటాడు. తల్లి, చిత్ర ఇద్దరూ తన ప్రేమ గురించి ముందే మాట్లాడుకున్న విషయం
తెలుసుకుంటాడు. తిరిగి చిత్ర వద్దకు వెళ్లి పెళ్లిచేసుకుందాం అంటాడు. చిత్ర మాత్రం రాజ్ తరుణ్ ను రిజెక్ట్ చేస్తుంది. చివరికి ఓ పెళ్లిలో కొన్ని ఫన్నీ మూమెంట్స్ మధ్య చిత్ర మెడలో రాజ్ తరుణ్ తాళి కట్టడంతో కథ సుఖాంతం అవుతుంది.
ప్లస్ పాయింట్స్
– రాజ్ తరుణ్ యాక్టింగ్
– హీరో,హీరోయిన్ కెమిస్ట్రీ
– కామెడీ
మైనస్ పాయింట్స్
– హెవీ సెంటిమెంట్
– సాగదీసిన స్క్రీన్ ప్లే
– సంగీతం
– ప్రొడక్షన్ వాల్యూస్
బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ రివ్యూ
రంగులరాట్నం సినిమా స్టిల్స్, పోస్టర్లు, ట్రయిలర్.. ఇలా ఏది చూసినా అందులో లవ్ ఎలిమెంట్స్ పుష్కలంగా కనిపించాయి. అదే మైండ్ సెట్ తో సినిమాకు వెళ్లిన ప్రేక్షకులకు మాత్రం షాక్ తప్పదు. ఎఁదుకంటే ఈ సినిమాలో ప్రేమ కంటే సెంటిమెంట్ ఎక్కువ. తల్లికొడుకు మధ్య సెంటిమెంట్ సినిమాలో చాలా ఎక్కువైంది. ప్రేమకథది ఆ తర్వాత స్థానం మాత్రమే.
నటీనటుల విషయానికొస్తే రాజ్ తరుణ్ మరోసారి ఆకట్టుకున్నాడు. బాయ్ నెక్ట్స్ డోర్ లుక్స్ తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ చిత్ర శుక్రాది చాలా బరువైన పాత్ర. అయినప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. కానీ కొన్ని సన్నివేశాల్లో హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ పండలేదు. మరీ ముఖ్యంగా హీరో కంటే హీరోయిన్ పెద్దగా కనిపించడం మైనస్. హీరో తల్లిగా సితార చక్కగా నటించింది. కమెడియన్ ప్రియదర్శి మరోసారి తన కెరీర్ లో మంచి పాత్ర పోషించాడు. రాజ్ తరుణ్, ప్రియదర్శి మధ్య కామెడీ బాగా పండింది. సినిమాను నిలబెట్టే ఎలిమెంట్ కూడా ఇదే. మిగతా నటీనటులంతా తమ పాత్రల మేరకు నటించారు.
టెక్నికల్ గా ఈ సినిమా చాలా వీక్ అని చెప్పొచ్చు. కొత్త దర్శకురాలు అవ్వడం వల్ల ఈ టెక్నికల్ లోపాలు ఉన్నాయా.. లేక లో-బడ్జెట్ కారణంగా ఇలా జరిగిందా అనేది చెప్పడం కష్టం. ఇలాంటి సినిమాకు ఎంతో కీలకమైన శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. పాటలు ఇంకాస్త బాగుంటే బెటర్. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఫర్వాలేదు. దర్శకురాలు శ్రీరంజని కొన్ని సందర్భాల్లో తన డైరక్షనల్ మేజిక్ చూపించారు. కానీ ఓవరాల్ గా మాత్రం ఆమె ఎంట్రీకి రంగులరాట్నం కలిసిరాదు. పార్టులు పార్టులుగా సినిమా బాగుంటుంది కానీ కలిపి చూడలేం.
ఈ సంక్రాంతికి జనాలంతా హుషారుగా, ఫెస్టివ్ మూడ్ లో ఉంటారు. ఇలాంటి టైమ్ లో ఇంత హెవీ డోస్ సెంటిమెంట్ తో సినిమా రిలీజ్ చేయడం సాహసమనే చెప్పాలి.
ఓవరాల్ గా రంగులరాట్నం సినిమాలో సెంటిమెంట్ ఎక్కువ, ప్రేమ తక్కువగా కనిపిస్తుంది.
రేటింగ్ – 2.75/5