రకుల్ ప్రీత్ సింగ్ ఇంటర్వ్యూ

Published On: November 20, 2017   |   Posted By:
రకుల్ ప్రీత్ సింగ్ ఇంటర్వ్యూ
ఖాకి హిట్ తో ఖుషీగా ఉంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. కెరీర్ లో మరో సక్సెస్ అందుకున్నందుకు ఆనందంగా ఉంది. తన ఆనందాన్ని మీడియాతో పంచుకుంది ఈ భామ. మిలట్రీ బ్యాక్ గ్రాండ్ నుంచి వచ్చిన తను ఖాకి లాంటి సినిమాలు చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తానని అంటున్న రకుల్.. తన మనుసులోని భావాల్ని మీడియాతో పంచుకుంది.
అందరికీ చాలా థ్యాంక్స్
ఖాకీ సినిమా రిలీజయింది. అన్ని వైపుల నుండి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. డబ్బింగ్ సినిమా అయినా కూడా తెలుగులో ఈ రేంజ్ సక్సెస్ వచ్చిందంటే కచ్చితంగా సబ్జెక్ట్ ఓరియంటెడ్ సినిమాలు సక్సెస్ అవుతాయనే నమ్మకం వచ్చింది.
ఖాకిలో పాత్ర గురించి..
ఈ సినిమాలో కార్తికి భార్యగా నా పాత్రని నేను చాలా ఎంజాయ్ చేశాను. ఒక మధ్యతరగతి భార్యాభర్తల మధ్య ఉండే కెమిస్ట్రీ, దొరికిన ఆ కాస్త టైమ్ ని  వాళ్ళు ఎలా స్పెండ్ చేస్తారు.. వాళ్ళిద్దరి మధ్య ఆసక్తికరమైన సంభాషణలు, ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంటాయి. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటాయి.
దేనికైనా మంచి స్క్రిప్ట్ కావాలి
నటీనటుల్లో ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ.. ఎంచుకున్న స్క్రిప్ట్ లో స్కోప్ లేకపోతే ఏమీ చేయలేం. ఈ రోజు ఖాకి సినిమాకు సంబంధించి నటీనటుల నటనకు ఇంత మంచి రెస్పాన్స్, ప్రశంసలు వస్తున్నాయంటే దానికి కారణం కేవలం స్క్రిప్ట్. కథలో దమ్ముంటేనే నటీనటుల్లో టాలెంట్ బయటకొస్తుంది.
పోలీస్ అంటే చాలా గౌరవం
నాది బేసిగ్గా మిలిటరీ బ్యాక్ డ్రాప్ కాబట్టి నాకు మాములుగానే డిఫెన్స్, పోలీస్ పై గౌరవం ఎక్కువ. ఖాకీ సినిమాకి ముందే పోలీసులు పడే కష్టాలు, వారి రెస్పాన్సిబిలిటీస్ నాకు తెలుసు. చిన్నప్పుడు నాన్నతో కలిసి 4 రోజులు బంకర్లో గడిపాను, ఫైరింగ్ జరుగుతున్నప్పుడు దగ్గరుండి చూశాను. టెర్రరిస్టులు మా ఇంటి చుట్టు పక్కలకి రావడం చూశాను. సో నాకు పోలీస్ అంటే చిన్నప్పటి నుండే చాలా గౌరవం.
భార్య పాత్ర అయినప్పటికీ..
ఖాకీలో భార్య క్యారెక్టర్ అనగానే బిగినింగ్ లో ఆలోచించాను. వైఫ్ క్యారెక్టర్ అంటే ఎంతైనా సీనియర్ క్యారెక్టర్ అవుతుంది అని డైలామాలో ఉన్నప్పుడు క్యారెక్టర్ విన్నాను.. ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ అవ్వకుండా పెళ్ళి అయ్యే అమ్మాయి క్యారెక్టర్ అదీ.. ఆ క్యారెక్టర్ ని హ్యాండిల్ చేయడం కూడా చాలా క్యూట్ గా ఇంప్రెసివ్ గా ఉంది.. అందుకే ఒప్పుకున్నాను…
కార్తి చాలా గ్రేట్
కార్తీ సినిమాలు గమనిస్తే కాష్మోరా, చెలియా, ఇప్పుడు ఖాకీ… తన కరియర్ లో ప్లాన్ చేసుకుంటున్న సినిమాల్లో  ఒక దానితో ఇంకో దానికి సంబంధం ఉండదు. ఎప్పుడూ ఏదో ఒకటి ఎక్స్ పెరిమెంట్ చేస్తూనే ఉంటాడు. చాలా డేరింగ్ గా ఉంటాడు. ఈ సినిమా కోసం 3 నెలలు రాజస్థాన్ లో ఉండాల్సి వచ్చినపుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు.
ఈ కేసు గురించి తెలీదు
నాకు పోలీస్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనే నాలెడ్జ్ ఉంది కానీ 1995-2005 లో జరిగిన ఈ కేసు గురించి డైరెక్టర్ చెప్పినంతవకు తెలీదు. వినోద్ గారు ఈ సినిమా కోసం ఒక్క చిన్న పాయింట్ ని కూడా వదలకుండా చాలా రీసర్చ్ చేశారు.
అప్ కమింగ్ మూవీస్
కార్తీతో ఇంకో సినిమా చేయబోతున్నాను. అది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఉంటుంది. తెలుగులో కూడా 2 సినిమాలున్నాయి. అవి కూడా వచ్చే ఏడాదే ప్రారంభమౌతాయి. వాటి గురించి ఇప్పుడే చెప్పడం బాగోదు. ఇక హిందీలో అయ్యారే సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. సూర్యతో సినిమా ఇంకా ఓకే అవ్వలేదు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ నడుస్తుంది. దానిపై ఇప్పుడే స్పందించలేను.