రచయిత లక్ష్మీ భూపాల బర్త్ డే ఇంటర్వ్యూ
Published On: September 14, 2020 | Posted By: ivs

‘చందమామ’, ‘అలా మొదలైంది’, ‘మహాత్మ’, ‘టెర్రర్’, ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘కల్యాణ వైభోగమే’ ‘ఓ బేబీ’ చిత్రాలతో మాటల రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు లక్ష్మీ భూపాల్. సెప్టెంబర్ 15న తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు.
పదునైన మాటలతో పాటు సున్నితమైన పాటలు రాయడం లక్ష్మీ భూపాలకు అలవాటు సిద్ధార్థ్, సమంత జబర్దస్త్, రానా ‘నేనే రాజు నేనే మంత్రి’ కల్యాణ వైభోగమే వంటి మరిన్ని సినిమాల్లో పాటలు రాశారు. అలాగే ప్రస్తుతం కన్నడలో మంచి విజయం సాధించిన లవ్ మాక్టైల్ తెలుగులో గుర్తుందా శీతాకాలం సినిమాకు మాటలు రాస్తున్నారు. సత్యదేవ్, తమన్నా ఈ మూవీలో నటిస్తున్నారు. అలాగే రాజశేఖర్ తో నీలకంఠ దర్శకత్వంలో ఒక సినిమాకు లక్ష్మీ భూపాల మాటలు రాస్తుండడం విశేషం.