రథేరా 2 చిత్రం చివరి షెడ్యూల్ ప్రారంభం

Published On: August 1, 2020   |   Posted By:

రథేరా 2 చిత్రం చివరి షెడ్యూల్ ప్రారంభం

కోకో నేపథ్యంలో వస్తోన్న రథేరా 2 (కోకో ఆట) చిత్రం చివరి షెడ్యూల్ ప్రారంభం

కోకో నేపథ్యంలో వచ్చిన రథేరా సినిమా మంచి విజయం సాధించింది, ఈ సినిమా విడుదల తరువాత ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, దర్శకుడు వివి.వినాయక్ సినిమా యూనిట్ ను ప్రశంసించారు ఇప్పుడు అదే నేపథ్యంలో రదేరా 2 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చివరి షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంభందించిన పూర్తి వివరాలు చిత్ర యూనిట్ త్వరలో తెలుపనుంది.

రేపు (ఆగస్ట్ 1న) రథేరా సినిమా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ నరేష్ యాదవ్ గారి పుట్టినరోజు కావున తోటి నటీనటులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నరేష్ యాదవ్ రథేరా సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ పోసించడమే కాకుండా కో.ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. రథేరా 2 లో (కోకో ఆట) కూడా ఆయన పాత్ర కొనసాగుతుంది.