రవితేజ కల్యాణ్ కృష్ణ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్

Published On: February 22, 2018   |   Posted By:

రవితేజ కల్యాణ్ కృష్ణ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్

ప్రస్తుతం సెట్స్ పై ఉన్న రవితేజ సినిమాకు భారీగా ఆఫర్లు వస్తున్నాయి. ఇంకా ప్రీ-రిలీజ్ బిజినెస్ స్టార్ట్ చేయకముందే క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. అయితే థియేట్రికల్ బిజినెస్ కంటే ముందు ఇతర లావాదేవీలు పూర్తిచేశారు నిర్మాత రామ్ తాళ్లూరి. ఇందులో భాగంగా సన్ నెట్ వర్క్ తో ఏకంగా 25 కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నారు.

కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ కలుపుకొని 25 కోట్ల రూపాయలకు హోల్ సేల్ గా దక్కించుకుంది సన్ నెట్ వర్క్. రవితేజ సినిమాలకు హిందీ డబ్బింగ్ రైట్స్ కు మంచి గిరాకీ ఉన్న విషయం తెలిసిందే. కాకపోతే డీల్ మొత్తం ఒకేసారి పూర్తిచేసే ఉద్దేశంతో ఇలా నిర్ణయించారు. ఈ సినిమాకు నేల టికెట్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.