రవితేజ చిత్రంలో తాన్యా హోప్…

Published On: September 12, 2017   |   Posted By:

రవితేజ చిత్రంలో తాన్యా హోప్…

జగపతిబాబు పటేల్ సార్ సినిమాలో ఐపియస్ ఆఫీసర్ పాత్రలో నటించిన తాన్యా హోప్ అంతకు ముందుగా అప్పట్లో ఒకడుండేవాడు చిత్రంలో కూడా నటించింది. ఈ కన్నడభామ ఇప్పుడు తెలుగులో మాస్ మహారాజా రవితేజ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుందని సమాచారం. తమిళంలో జయం రవి, హన్సిక, అరవిందస్వామి ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం `భోగన్`.

వివరాల్లోకెళ్తే..`భోగన్`  చిత్రాన్ని రవితేజతో తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. తమిళ మాతృకలో అక్షర గౌడ చేసిన పాత్రను తెలుగులో తాన్యా హోప్ చేయనుందని వార్తలు వినపడుతున్నాయి. ప్రస్తుతం రవితేజ `రాజా ది గ్రేట్`, `టచ్ చేసి చూడు` చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత `భోగన్` రీమేక్‌లో నటించబోతున్నాడు. తమిళంలో అరవిందస్వామి చేసిన పాత్రను తెలుగులో కూడా అరవిందస్వామి చేస్తున్నాడు. హన్సిక స్థానంలో క్యాథరిన్ నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలుస్తాయి.