రాజుగారి గది-2, గల్ఫ్ సినిమాల ప్రివ్యూ

Published On: October 12, 2017   |   Posted By:

రాజుగారి గది-2, గల్ఫ్ సినిమాల ప్రివ్యూ

నాగార్జున నటించిన రాజుగారి గది-2, సునీల్ కుమార్ రెడ్డి డైరక్ట్ చేసిన గల్ఫ్ సినిమాలు రేపు (13-10-2017) రిలీజ్ కానున్నాయి. ఓవైపు దసరా సినిమాల హవా తగ్గడం, మరోవైపు థియేటర్లు దొరకడం ఈ రెండు సినిమాలకు కలిసొచ్చే అంశాలు. మరికొన్ని గంటల్లో విడుదలకానున్న ఈ రెండు సినిమాల్లో హైలెట్స్ ఏంటో చూద్దాం.

రాజుగారి గది-2

నాగార్జున నటించిన మొట్టమొదటి హారర్ సినిమా ఇది. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రుద్ర అనే మెంటలిస్ట్ పాత్రలో నాగార్జున కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రయిలర్ లో నాగ్ లుక్ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. ఇదొక ఎట్రాక్షన్ అనుకుంటే, అమృత పాత్రలో సమంత మరో మెయిన్ ఎట్రాక్షన్. ఈ సినిమాలో లాయర్ రోల్ లో కనిపించనుంది సమంత. తర్వాత హత్యకు గురై ఆత్మగా మారుతుంది. నాగార్జున, సమంత పాత్రల చుట్టూనే తిరుగుతుంది రాజుగారి గది-2.

గల్ఫ్

రాజుగారి గది-2తో పాటు థియేటర్లలోకి వస్తున్న మరో మూవీ గల్ఫ్. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో సందేశాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాకు డీసెంట్ థియేటర్లు దక్కాయి. తెలుగు రాష్ట్రాల్లో 120 స్క్రీన్స్, కర్ణాటకలో 15, ఓవర్సీస్ లో మరో 15 కలుపుకొని.. మొత్తం 150 తెరలు దక్కాయి. ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమకథ, గంగపుత్రులు’ వంటి విలక్షణ సినిమాల్ని డైరెక్ట్ చేసిన సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో గల్ఫ్ మూవీ తెరకెక్కింది. గల్ఫ్ వలస బాధితులు పడుతున్న కష్టాల్ని ప్రభుత్వాలకు చూపి, వారి పట్ల స్పందించేలా చేయాలనేది ఈ సినిమా ఉద్దేశం. చేతన్, డింపుల్ హీరోహీరోయిన్లుగా నటించారు.