రాజ్‌త‌రుణ్‌తో నాలుగోసారి..

Published On: September 12, 2017   |   Posted By:

రాజ్‌త‌రుణ్‌తో నాలుగోసారి..

సాధార‌ణంగా ఓ యువ హీరోతో ఓ నిర్మాణ సంస్థ వ‌రుస సినిమాలు చేయ‌డం అంటే ఈ రోజుల్లో చిన్న విష‌యం కాదు. కానీ రాజ్‌త‌రుణ్ ఓ నిర్మాణ సంస్థ‌తో నాలుగోసారి క‌లిసి ప‌నిచేయ‌బోతున్నాడు.

ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌లో రాజ్‌తరుణ్ ఇప్ప‌టికే మూడు సినిమాలు చేశాడు. త్వ‌ర‌లోనే నాలుగో సినిమా ట్రాక్ ఎక్క‌నుందని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

గుండె జారి గ‌ల్లంత‌య్యిదే, ఒక లైలా కోసం సినిమాల‌ను డైరెక్ట్ చేసిన విజ‌య్‌కుమార్ కొండ ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌నున్నాడ‌ట‌. ఒక లైలా కోసం సినిమా త‌ర్వాత విజ‌య్ కుమార్ కొండ మ‌రో సినిమాను డైరెక్ట్  చేయ‌లేదు. మ‌ధ్య‌లో నితిన్‌, విజ‌య్‌కుమార్ కొండ కాంబినేష‌న్‌లో గుండె జారి గ‌ల్లంత‌య్యిందే సీక్వెల్ రూపొందుతోంద‌ని వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే క‌థ న‌చ్చ‌క‌పోవ‌డంతో నితిన్ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్నాడు.

ఇప్పుడు విజ‌య్‌కుమార్ కొండ ద‌ర్శ‌క‌త్వంలో రాజ్‌త‌రుణ్ సినిమా చేయ‌బోతున్నాడు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డ‌వుతాయి.