రాజ్ త‌రుణ్  ల‌వ‌ర్‌  రిలీజ్ డేట్

Published On: February 23, 2018   |   Posted By:

రాజ్ త‌రుణ్  ల‌వ‌ర్‌  రిలీజ్ డేట్

తొలి చిత్రం `ఊయ్యాల జంపాల‌`తో స‌క్సెస్‌ఫుల్ హీరోగా కెరీర్‌ను స్టార్ట్‌చేసిన యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్. వ‌రుస విజ‌యాల‌తో తెలుగు ప్రేక్ష‌కులదరికీ చాలా ద‌గ్గ‌ర‌య్యారు. ఇప్పుడు స‌క్సెస్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మాణంలో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై `ల‌వ‌ర్‌` సినిమాలో న‌టిస్తున్నారు. అలా ఎలా ఫేమ్ అనీశ్ కృష్ణ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ప్రేమ‌లోకి కొత్త కోణాల‌ను ట‌చ్ చేసేలా తెర‌కెక్కుతుంది. రిద్దికుమార్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. స‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా.. ప్ర‌వీణ్ పూడి ఎడిటింగ్ వ‌ర్క్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోన్న ఈ సినిమాను జూన్ 14న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత దిల్‌రాజు స‌న్నాహాలు చేస్తున్నారు.