రామ్‌చ‌ర‌ణ్ నెక్ట్స్ సినిమా టైటిల్‌

Published On: April 17, 2018   |   Posted By:

రామ్‌చ‌ర‌ణ్ నెక్ట్స్ సినిమా టైటిల్‌

మెగాప‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఒక‌రేమో మాస్ ఇమేజ్ ఉన్న హీరో.. మ‌రొక‌రు మాస్ ప‌ల్స్ తెలిసిన డైరెక్ట‌ర్ కావ‌డంతో.. సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఈ సినిమాలో చ‌ర‌ణ్‌కు ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేష్‌లు అన్న‌య్య‌లుగా, స్నేహ‌, అన‌న్య వ‌దినలుగా న‌టిస్తున్నారు. కియ‌రా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తుంది. వివేక్ ఒబెరాయ్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమాను ద‌స‌రాకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ గురించి చాలా వార్త‌లు ఇండ‌స్ట్రీలో విన‌ప‌డుతున్నాయి.

`రాజ‌వంశ‌స్థుడు` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని కొంద‌రు అంటున్నారు.