రామ్ లెక్కెంటో

Published On: August 10, 2017   |   Posted By:
రామ్ లెక్కెంటో
ఎన‌ర్జిటిక్ స్టార్‌గా పేరున్న హీరో రామ్, కిషోర్ తిర‌మ‌ల కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం `ఉన్న‌ది ఒక్క‌టే జీవితం`. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో గ‌తంలో విడుడ‌లైన నేను శైల‌జ‌తో గ‌తేడాది ఆరంభంలో ఘ‌న‌విజ‌యాన్ని సొంతం చేసుకున్నాడు రామ్‌. ఆ త‌రువాత సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ న‌టించిన  హైప‌ర్ మాత్రం రామ్‌కు నిరాశ‌నే మిగిల్చి యావ‌రేజ్ టాక్ తెచ్చుకుంది.
ఎలాగైనా స‌క్సెస్‌ని సొంతం చేసుకోవాల‌న్న క‌సితో.. మ‌రోసారి నేను శైల‌జ ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల కాంబినేష‌న్‌లో ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ సినిమా చేస్తున్నాడు. స‌గానికి పైగా చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా సెప్టెంబ‌ర్ 29న విడుద‌ల కావ‌చ్చ‌ని టాలీవుడ్ వ‌ర్గాల్లో న్యూస్ వ‌స్తుంది.
విన‌ప‌డుతున్న వార్త‌ల ప్ర‌కారం ఉన్న‌ది ఒక్క‌టే జీవితం అదేరోజున విడుద‌లైతే రామ్ గ‌త చిత్రం హైప‌ర్ త‌రువాత స‌రిగ్గా ఏడాదికి అత‌ని ద‌ర్శ‌నం అభిమానుల‌కు క‌నువిందు చేస్తాడ‌న్న‌మాట‌.  హైప‌ర్ గ‌తేడాది సెప్టెంబ‌ర్ 30న విడుద‌లయ్యింది. ఆ రోజుకు ఒక్క రోజు ముందు అంటే.. స‌రిగ్గా ఏడాదికి అత‌ని కొత్త చిత్రం ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ రానుంద‌న్నమాట‌. మ‌రి రామ్ లెక్కెంటో అత‌నికే తెలియాలి సుమా..