రామ్ సినిమాకు ముహూర్తం కుదిరింది

Published On: February 13, 2018   |   Posted By:

రామ్ సినిమాకు ముహూర్తం కుదిరింది

`ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ` చిత్రం త‌ర్వాత ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ దిల్‌రాజు బ్యాన‌ర్‌లో సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. మేం వ‌య‌సుకు వ‌చ్చాం, సినిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్ చిత్రాల ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. రామ్ స‌ర‌స‌న ఇద్ద‌రు హీరోయిన్స్ న‌టిస్తున్నారు. అందులో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఒక‌టి. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్‌ను మార్చి 16నుండి ప్రారంభిస్తార‌ట‌. మామ‌, అల్లుడు మ‌ధ్య జ‌రిగే ఆస‌క్తిక‌ర‌మైన ..టామ్ అండ్ జెర్రీ ఫైట్‌లాంటి క‌థాశంతో సినిమా ఉంటుంది.