రిక్షా తొక్కిన రకుల్ ప్రీత్ సింగ్

Published On: July 26, 2017   |   Posted By:

రిక్షా తొక్కిన రకుల్ ప్రీత్ సింగ్

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రిక్షా తొక్కింది. అది కూడా ఏ ఛారిటీ కోసమో కాదు. తన సినిమా షూటింగ్ కోసం రిక్షా తొక్కింది. ప్రస్తుతం కోలీవుడ్ లో కార్తి హీరోగా ఓ సినిమాలో నటిస్తోంది రకుల్ ప్రీత్. ఈ సినిమా షూటింగ్ పాండిచ్చేరిలో జరుగుతోంది. స్టోరీ ప్రకారం.. ఓ సీన్ లో రకుల్ ప్రీత్ రిక్షా తొక్కాలి. అలా అనుకోకుండా రిక్షా తొక్కేసింది ఈ ముద్దుగుమ్మ.

ఇంతకుముందు చేసిన ఓ తెలుగు సినిమా కోసం బైక్ రైడింగ్ నేర్చుకుంది రకుల్. గంటపాటు ప్రాక్టీస్ చేసి బైక్ రైడింగ్ సీన్ షూట్ చేసింది. ఇప్పుడు రిక్షాకు కూడా అదే ఫార్ములా ఫాలో అయింది.  పాండీ వీధుల్లో గంట పాటు రిక్షా తొక్కిందట రకుల్. ఆ తర్వాత ఆ సీన్ ను షూట్ చేశారు.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు తమిళ సినిమాలపై కూడా ఫోకస్ పెట్టింది. కార్తి హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. త్వరలోనే విజయ్ సరసన కూడా నటించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.