రీమేక్‌లో నంద‌మూరి హీరో

Published On: December 6, 2017   |   Posted By:

రీమేక్‌లో నంద‌మూరి హీరో

ప్ర‌స్తుతం ఉన్న నంద‌మూరి యువ హీరోల్లో ఎన్టీఆర్‌, క‌ల్యాణ్ రామ్‌లు సినిమాల్లో త‌మదైన మార్కు చూపిస్తూ ముందుకెళుతున్నారు. మాస్ ఇమేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్‌ను ప‌క్క‌న పెడితే, క‌ల్యాణ్ రామ్ హీరోగా, నిర్మాత‌గా రాణిస్తున్నాడు. జై ల‌వ‌కుశ చిత్రంతో నిర్మాత‌గా స‌క్సెస్ సాధించిన క‌ల్యాణ్ రామ్‌..హీరోగా రెండు సినిమాల‌ను చేస్తున్నాడు. అందులో ఎం.ఎల్‌.ఎ సినిమా ఒక‌టి కాగా, మ‌రో సినిమా జ‌యేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో ఉంటుంది. ఈ రెండు చిత్రాలు కాకుండా మ‌ల‌యాళ విజ‌యం సాధించిన `రామ్ లీలా` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నాడ‌ని స‌మాచారం. ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం క‌ల్యాణ్ రామ్ ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని ఇండ‌స్ట్రీ వర్గాల టాక్‌.