రీమేక్ ఆలోచ‌న‌లో వెంకీ

Published On: March 13, 2018   |   Posted By:

రీమేక్ ఆలోచ‌న‌లో వెంకీ

సీనియ‌ర్ హీరో వెంక‌టేశ్ ఇప్పుడు తేజ ద‌ర్శ‌క‌త్వంలో `ఆటా నాదే.. వేటా నాదే` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత వెంకీ ఓ మ‌ల‌యాళ సినిమాను రీమేక్ చేసే ఉద్దేశంలో ఉన్నాడ‌ని స‌మాచారం. వివ‌రాల్లోకెళ్తే.. మ‌ల‌యాళంలో హ‌నీఫ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన చిత్రం `ది గ్రేట్ ఫాద‌ర్‌`. మ‌మ్ముట్టి హీరోగా న‌టించిన ఈ చిత్రాన్ని వెంకీ ప్ర‌త్యేకంగా వీక్షించాడ‌ట‌. అన్ని కుదిరితే వెంక‌టేశ్ తెలుగులో రీమేక్ చేస్తాడ‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. అయితే విక్ర‌మ్ కూడా ఈ సినిమా రీమేక్ ప‌ట్ల ఆస‌క్తిగా ఉన్నాడ‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. మ‌రి రీమేక్ గురించిన పూర్తి వివ‌రాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.