రూ. 18 కోట్లకు అమ్ముడుపోయిన మహానటి శాటిలైట్ రైట్స్

Published On: May 23, 2018   |   Posted By:

రూ. 18 కోట్లకు అమ్ముడుపోయిన మహానటి శాటిలైట్ రైట్స్

మొదట 5 కోట్లు అన్నారు. ఆ తర్వాత 8 కోట్లకు వెళ్లింది. ఇప్పుడు ఏకంగా 18 కోట్ల రూపాయలకు డీల్ సెట్ అయింది. మహానటి సినిమా ద్వారా  అశ్వనీదత్ కు పట్టిన అదృష్టమిది. అవును.. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఏకంగా 18 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. విడుదలకు ముందు 5 కోట్ల రూపాయలకు అమ్మేయాలనుకున్న అశ్వనీదత్.. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఏకంగా 18 కోట్ల రూపాయలకు డీల్ సెట్ చేసుకున్నాడు.

తెలుగు, తమిళ్ తో పాటు హిందీ డబ్బింగ్, డిజిటల్ రైట్స్ కలుపుకొని మహానటి సినిమా హక్కుల్ని 18 కోట్ల రూపాయలకు దక్కించుకుంది జీ తెలుగు ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్. ఈమద్య కాలంలో అశ్వనీదత్ అందుకున్న పెద్ద డీల్ ఇదే. ఒక దశలో మహానటి సినిమాను కొనేందుకు బయ్యర్లు కూడా ముందుకురాకపోతే ఏపీలోని చాలా చోట్ల తనే స్వయంగా సినిమాను రిలీజ్ చేశాడు. ఇప్పుడు ఆ ప్రాంతాలన్నీ బ్రేక్-ఈవెన్ అయి అశ్వనీదత్ కు లాభాలు అందిస్తున్నాయి. అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా కళ్లుచెదిరే కలెక్షన్లు రాబడతూ అశ్వనీదత్ ను ఆనందంలో నింపింది.