రేపటి సినిమాలు

Published On: July 27, 2017   |   Posted By:
రేపటి సినిమాలు
ఫిదా సినిమా సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలో నడుస్తున్న వేళ.. ఆ మూవీకి పోటీ ఇచ్చేందుకు తాజాగా మరో రెండు సినిమాలు ఈ వీకెండ్ రెడీ(28.07.2017) అవుతున్నాయి. అవే గౌతమ్ నంద, వాసుకి. వీటిలో ఒకటి పక్కా కమర్షియల్ సినిమా కాగా  ఇంకోటి హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ.
గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గౌతమ్ నంద. శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై గోపీచంద్ తో పాటు అటు సంపత్ నంది చాలా ఆశలు పెట్టుకున్నారు. కేవలం కథను నమ్మి ఈ సినిమా తీశామని.. కచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నాడు సంపత్ నంది. అటు గోపీచంద్ కూడా గౌతమ్ నంద తన ఆకలి తీరుస్తుందని ఇప్పటికే ప్రకటించాడు. హన్సిక, క్యాథరీన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు.
ఇక రేపు థియేటర్లలోకి వస్తున్న మరో సినిమా వాసుకి. నయనతార లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమాలో ఆమెకు భర్తగా మమ్ముట్టి నటించాడు. డ్రగ్స్, అత్యాచారం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన పుదియ నిలయం అనే సినిమాకు డబ్బింగ్ గా వాసుకి వస్తోంది. ఈ సినిమాలో నటనకు గాను ఉత్తమ నటిగా ఇప్పటికే ఫిలింఫేర్ అందుకుంది. అందుకే ఈ మూవీపై తెలుగు ప్రేక్షకుల్లో కూడా అంచనాలు పెరిగాయి.