రేపే ఉయ్యాలవాడ మోషన్ పోస్టర్

Published On: August 21, 2017   |   Posted By:

రేపే ఉయ్యాలవాడ మోషన్ పోస్టర్

సరిగ్గా ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. 11 గంటల 30 నిమిషాలకు మోషన్ పోస్టర్ యూట్యూబ్ లో అప్ లోడ్ అవుతుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి రాజమౌళిని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. జక్కన్న చేతుల మీదుగానే చిరంజీవి 151వ సినిమా మోషన్ పోస్టర్ లాంచ్ అవుతుంది.

స్వతంత్ర్య పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ఏ టైటిల్ పెడతారనే ఉత్సుకత అందర్లో ఉంది. నిజానికి మొన్నటివరకు ఈ సినిమాకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే టైటిల్ నే అనుకున్నారు. కానీ దేశవ్యాప్తంగా విడుదల చేస్తూ, బాలీవుడ్ ప్రేక్షకులకు  కూడా కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో టైటిల్ మార్చినట్టు తెలుస్తోంది. ఆ టైటిల్ ఏంటనేది రేపు తెలిసిపోతుంది.

రేపు చిరంజీవి పుట్టినరోజు ఈ సందర్భంగా 151వ సినిమా మోషన్ పోస్టర్ ను విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం ఇప్పటికే పూర్తయిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ కు చెందిన కొణెదల ప్రొడక్షన్స్ ఆఫీస్ లో చిరు 151వ చిత్రం కొన్ని రోజుల కిందట పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.