రేపే మహానుభావుడు రిలీజ్

Published On: September 28, 2017   |   Posted By:

రేపే మహానుభావుడు రిలీజ్

దసరా బరిలో ముచ్చటగా మూడో సినిమా వచ్చేస్తోంది. అదే శర్వానంద్ నటించిన మహానుభావుడు మూవీ. ఓవైపు జై లవకుశ సినిమా సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. మరోవైపు స్పైడర్ సినిమా భారీ ఎత్తున విడుదలైంది. ఈ రెండు సినిమాలతో తీవ్రస్థాయిలో పోటీ ఉన్నప్పటికీ మహానుభావుడు వెనక్కి తగ్గడం లేదు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ థియేటర్లు దక్కాయి.

మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన మహానుభావుడు సినిమాపై కూడా మంచి బజ్ ఉంది. ఈ సినిమా పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయి. ట్రయిలర్ కైతే ట్రమెండస్ రెస్పాన్స్ వచ్చింది. అందుకే మహానుభావుడు సినిమా కూడా రేసులో నిలిచింది. శర్వానంద్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు.

దసరా బరిలో శర్వానంద్ నిలవడానికి మరో సెంటిమెంట్ కూడా ఉంది. ఫెస్టివ్ టైమ్ లో శర్వానంద్ ఓ సినిమా రిలీజ్ చేస్తే అది కచ్చితంగా హిట్ అవుతుంది. గతంలో వచ్చిన రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాల విషయంలో ఇది నిజమైంది. అందుకే ఆ సెంటిమెంట్ కొద్దీ మహానుభావుడు సినిమాను కూడా ఫెస్టివల్ సీజన్ లోనే విడుదల చేస్తున్నాడు శర్వానంద్. రేపు థియేటర్లలోకి వస్తున్న ఈ మూవీ ఎన్టీఆర్, మహేష్ సినిమాలకు ఏ రేంజ్ లో తట్టుకుంటుందో చూడాలి.