రేపే స్పైడర్ టీజర్ లాంచ్

Published On: August 8, 2017   |   Posted By:

రేపే స్పైడర్ టీజర్ లాంచ్

ఘట్టమనేని అభిమానులంతా ఆశగా ఎదురుచూస్తున్న టైమ్ రానే వచ్చింది. మరికొన్ని గంటల్లో మహేష్ బాబు నటిస్తున్న స్పైడర్ సినిమా టీజర్ విడుదలకాబోతోంది. రేపు మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ను లాంచ్ చేయబోతున్నారు. ఈ మూవీతో తమిళ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు మహేష్.

స్పైడర్ సినిమాకు సంబంధించి టీజర్ ఇప్పటికే విడుదలైంది. కాకపోతే దానికి మేకర్స్ టీజర్ అనే పేరు పెట్టలేదు. “గ్లింప్స్ ఆఫ్ స్పైడర్” గా వ్యవహరించారు. అసలైన టీజర్ రేపు రిలీజ్ అవుతోంది. దీనికి సంబంధించి అఫీషియల్ గా కౌంట్ డౌన్ పోస్టర్ కూడా విడుదల చేశారు. రేపు ఉదయం సరిగ్గా 9 గంటలకు టీజర్ విడుదల చేస్తామని అందులో ప్రకటించారు.

మహేష్ ఈ మూవీలో మోస్ట్ స్టయిలిష్ గా కనిపిస్తున్నాడు. మురుగదాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రిన్స్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది. దసరా కనుకగా సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ విడుదలకానుంది స్పైడర్ సినిమా.