రోష‌గాడు తో విజ‌య్ ఆంటోని మెసేజ్

Published On: February 8, 2018   |   Posted By:

రోష‌గాడు తో విజ‌య్ ఆంటోని మెసేజ్

న‌కిలీ, డా.స‌లీం, బిచ్చ‌గాడు చిత్రాలతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన త‌మిళ హీరో విజ‌య్ ఆంటోని ఇప్పుడు త‌న సినిమాల‌ను త‌మిళంతో పాటు తెలుగులో కూడా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటూ వ‌స్తున్నాడు. ఈ క్ర‌మంలో యమ‌న్‌, ఇంద్ర‌సేన వంటి సినిమాలు తెలుగులో విడుద‌ల‌య్యాయి. ఇప్పుడు విజ‌య్ ఆంటోని త‌న త‌దుప‌రి చిత్రాన్ని రోష‌గాడు పేరుతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌నున్నారు. ఈ సినిమాలో విజ‌య్ ఆంటోని పోలీస్‌గా క‌న‌ప‌డ‌బోతున్నారు. త‌న పాత్ర కోసం నిజ‌మైన పోలీస్ ఆఫీస‌ర్స్‌ను క‌లుస్తున్నాడ‌ట విజ‌య్ ఆంటోని. అలాగే టీనేజ్ పిల్ల‌ల‌కు స‌రైన మార్గ‌ద‌ర్శ‌క‌త్వం అవ‌సరం అనే మెసేజ్‌ను కూడా ఇందులో అందిస్తున్నాడ‌ట మ‌రి