ర‌జ‌నీకాంత్‌ మ‌రో కొత్త చిత్రం

Published On: February 24, 2018   |   Posted By:
ర‌జ‌నీకాంత్‌ మ‌రో కొత్త చిత్రం
త‌లైవా ర‌జ‌నీకాంత్‌తో కలిసి సినిమా చేయాల‌ని ఇప్ప‌టి త‌రం న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు కోరుకుంటారు. అయితే ఈ మ‌ధ్య ర‌జ‌నీకాంత్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం గురించి వార్త‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో ఆయ‌న ప్ర‌స్తుతం చేస్తున్న `2.0`, `కాలా` సినిమాలు త‌ర్వాత మ‌రో సినిమా చేయ‌డ‌ని అంద‌రూ అనుకున్నారు.
ఈ నేప‌థ్యంలో తలైవా మ‌రో సినిమా చేయ‌బోతున్నాడ‌నే వార్త‌కు ప్రాధాన్యం సంత‌రించుకుంది. తెలుగు, త‌మిళంలో విజ‌య‌వంత‌మైన `పిజ్జా` మూవీ ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్ ప‌నిచేయ‌నున్నారు. స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ ఈ సినిమాను నిర్మించ‌నున్నారు. విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడిగా పేరున్న కార్తీక్ సుబ్బ‌రాజు త‌లైవాను ఎలా తెర‌పై చూపించ‌బోతున్నాడో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.