ర‌జ‌నీకాంత్ అభిమానుల‌కు పండగేన‌ట‌…

Published On: September 7, 2017   |   Posted By:

ర‌జ‌నీకాంత్ అభిమానుల‌కు పండగేన‌ట‌…

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ అభిమానుల‌కు పండ‌గేన‌ని అంటున్నారు లైకా ప్రొడ‌క్ష‌న్స్ క్రియేటివ్ హెడ్ రాజ మ‌హాలింగం. ర‌జ‌నీకాంత్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న విజువ‌ల్ వండ‌ర్ `2.0`. ఈ సినిమా ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. 450 కోట్ల రూపాయ‌ల‌తో నిర్మిత‌మువ‌తున్న ఈ సినిమాను వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 25న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన అప్‌డేట్స్ అందించారు రాజ‌మ‌హాలింగం. పండ‌గ మొద‌లు కానుంది. అక్టోబ‌ర్ నెల‌లో దుబాయ్‌లో ఆడియో, ,న‌వంబ‌ర్‌లో హైద‌రాబాద్‌లో టీజ‌ర్‌, డిసెంబ‌ర్ ర‌జనీకాంత్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చెన్నైలో థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు అధికార‌కంగా ప్ర‌క‌టించారు. బాలీవుడ్ స్టార్ అక్ష‌య్‌కుమార్ విల‌న్‌గా న‌టిస్తున్న చిత్రంలో ఎమీజాక్స‌న్ లేడీ రోబో పాత్ర‌లో న‌టిస్తుంది.