ర‌జ‌నీని క్రాస్ చేసిన అజిత్‌

Published On: August 29, 2017   |   Posted By:

ర‌జ‌నీని క్రాస్ చేసిన అజిత్‌

త‌మిళంలో మాస్ ఫాలోయింజ్ అధికంగా ఉన్న హీరో అజిత్ ఒక‌రు. అజిత్ హీరోగా న‌టించిన వివేగం ఈ గురువారం థియేట‌ర్స్‌లో సంద‌డి చేసింది. తొలిరోజు వ‌సూళ్ల‌లో ఈ సినిమా సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఈ వ‌సూళ్లు ఎలా ఉన్నాయంటే ఏకంగా ర‌జ‌నీకాంత్ సిటీ రికార్డును కూడా క్రాస్ చేసేసింది.

ర‌జ‌నీకాంత్ గ‌త చిత్రం కబాలి తొలిరోజున చెన్నై సిటీ 1.12కోట్ల రూపాయ‌ల‌ను సాధించింది. విజ‌య్ హీరోగా న‌టించిన థెరి 1.05కోట్ల‌రూపాయ‌ల‌ను వ‌సూలు చేసింది.

ఈ రెండు సినిమాల రికార్డుల‌ను అజిత్ వివేకం క్రాస్ చేసేసింది. తొలిరోజు చెన్నై సిటీలో 1.21 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసింది. దీంతో అజిత్ మ‌రోసారి బాక్సాఫీస్ వ‌ద్ద త‌న స‌త్తాను చాటాడు. అజిత్ హీరోగా శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన హ్యాట్రిక్ మూవీ ఇది. గ‌తంలో ఈ హిట్ కాంబినేష‌న్‌లో వీరం, వేదాళం సినిమాలు సెన్సేష‌న‌ల్ హిట్స్ సాధించాయి. ఇప్పుడు మొత్తంగా వివేగం సినిమా ఎన్ని కోట్ల రూపాయ‌ల‌ను సాధిస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.